సోషల్ మీడియా వేదికలుగా డబ్బున్న వ్యక్తులను టార్గెట్ చేయడం రషీద అనే యువతికి వెన్నతో పెట్టిన విద్య.  వారిని పెళ్లాడడం.. వారితో కొన్ని రోజులు సంసారం చేయడం. కొన్ని రోజులకు నగలు, నగదుతో పారిపోవడం ఆమె నిత్య క్రుత్యం. ఆమె ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఎనిమిది మందిని వివాహం చేసుకుని నగలు, నగదుతో పారిపోయింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఒకరికి తెలియకుండా మరొకరిని పెండ్లి చేసుకోవడం. వారితో కొద్ది నెలల పాటు కాపురం చేయడం. సమయం చూసుకుని.. ఇంట్లోని నగదు, బంగారాన్ని అందినకాడికి దోచుకుని ఉడాయించడం. కొన్నేళ్లుగా ఓ నిత్య పెళ్లికూతురు నడుపుతున్న వ్యవహారం ఇది. తాజాగా ఆ నిత్య పెళ్లికూతురు బారిన పడిన ఓ బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఆ కీలేడీ గుట్టు రట్టు చేశారు. ఇప్పటివరకు ఎనిమిదిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది. ఈ కిలాడీ బారిన ఎంతోమంది పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తన మాయమాటలతో గాలం వేయడం రషీద అనే యువతికి వెన్నతో పెట్టిన విద్య. సోషల్ మీడియా వేదికలుగా డబ్బున్న వ్యక్తులను టార్గెట్ చేయడం. వారిని పెళ్లాడడం.. వారితో కొన్ని రోజులు సంసారం చేయడం.. ఆపై నగదు, నగలతో పరారు కావడం ఆమెకు పరిపాటే.. సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్‌ మూర్తి ఫిర్యాదు చేయడంతో నిత్య పెళ్లికూతురు లీలలు వెలుగులోకి వచ్చాయి. ఆ నిత్య పెళ్లి కూతురు ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఎనిమిది మందిని వివాహం చేసుకుని నగలు, నగదుతో పారిపోయినట్టు గుర్తించారు. ఆ
యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళానికి చెందిన మూర్తి అనే వ్యక్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో రషీద అనే యువతితో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ ఏడాది మార్చి 30న వివాహం చేసుకున్నారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన మూర్తికి చేదు అనుభవం ఎదురైంది. పెళ్లైన కొన్ని రోజులకే వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 

ఈ నేపథ్యంలో రషీద (ఈ నెల 4న)ఇంట్లో నుంచి పారిపోయింది. ఆ సమయంలో రూ.1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారు నగలను, విలువైన వస్తువులను పట్టుకుని పరారైంది. దీంతో మోసపోయానని గురించి.. మూర్తి పోలీసులను ఆశ్రయించాడు. మూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నీలగిరి జిల్లా గూడలూర్‌కు చెందిన రషీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ తెరచి డబ్బున్న యువకులను టార్గెట్ చేస్తుందనీ, ఆ తర్వాత వారిని వివాహం చేసుకుంటుందని, కొన్ని రోజుల తర్వాత ఇళ్లలో ఉన్న నగదు, నగలతో పారిపోతుందని తెలుసుకున్నారు. ఆమె ఇప్పటివరకు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎనిమిది వివాహాలు చేసుకున్నట్లు తేలింది. పరారీలో ఉన్న నిత్య పెళ్లి కూతురు కోసం పోలీసులు గాలిస్తున్నారు.