Asianet News TeluguAsianet News Telugu

యువకుడిని నడిరోడ్డుమీద చెప్పుతో కొట్టిన యువతి, ఎందుకో తెలుసా?

అందరి ముందే అతని ముఖం, చెంపలపై చెప్పుతో ఇష్టం వచ్చినట్లు కొట్టింది. అనంతరం అతనిని వదిలిపెట్టమని కోరడం గమనార్హం.

Man Allegedly Harasses Karnataka College Student, Beaten With Slippers ram
Author
First Published Jun 10, 2023, 11:53 AM IST


నడి రోడ్డుపై ఓ యువకుడిని  యువతి చెప్పుతో కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ యువతి అతనిని ఎందుకు కొట్టిందో తెలుసా? ఓ యువతిని దారుణంగా ఏడిపించాడు. అందుకే చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో కాలేజీ విద్యార్థిని ఓ యువకుడు వేధించాడు. దీంతో, ఆమె గ్రామస్థుల సహాయంతో అతనికి బుద్ధి చెప్పింది. అందరి ముందే అతని ముఖం, చెంపలపై చెప్పుతో ఇష్టం వచ్చినట్లు కొట్టింది. అనంతరం అతనిని వదిలిపెట్టమని కోరడం గమనార్హం.

అయితే, ఆ అమ్మాయి కొడుతున్నా, ఆ అబ్బాయి ఏ మాత్రం కదలకుండా అక్కడ నిలపడటం విశేషం. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్తున్న బాలికను ఆ వ్యక్తి వెంబడించి వేధించాడని స్థానికులు చెబుతున్నారు. కాగా, నిందితుడిని  ఆ తర్వాత పోలీసులకు అప్పగించడం గమనార్హం.
 

Follow Us:
Download App:
  • android
  • ios