లక్నో:  చనిపోయాడని  ఆసుపత్రి  సిబ్బంది తేల్చి చెప్పడంతో  అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపట్లో  అంత్యక్రియలు నిర్వహించే సమయంలో చనిపోయాడనుకొన్న వ్యక్తి లో కదలిక వచ్చింది. వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో గత నెల 21వ తేదీన మహ్మద్ ఫర్జాన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలకు గురైన అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  చికిత్స కోసం కుటుంబసభ్యులు దాదాపు రూ. 7 లక్షలు ఖర్చుచేశారు.

అయితే సోమవారం నాడు వైద్యులు చనిపోయాడని ప్రకటించారు.  అయితే ఫర్జాన్ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. కొన్ని క్షణాల్లో  అంత్యక్రియలు జరిగే సమయంలోనే ఫర్జాన్ లో కదలిక వచ్చింది. 

వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై అతడికి చికిత్స అందిస్తున్నారు.  ఆసుపత్రి చేసిన నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని  ఫర్జాన్  చెప్పారు.