ఒకసారి తన భార్యకు చేరువగా ఉండడాన్ని గమనించి తండ్రిని నిలదీశాడు. తన భార్యతో తండ్రి సాగిస్తున్న సంబంధం తెలుసుకుని హతాశయుడయ్యాడు. 

కూతురులాంటి కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ బంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని ఏకంగా.. అతనినే చంపేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు.. తన కొడుకు కనిపించడం లేదంటూ..తానే పోలీసు కేసు పెట్టడం గమనార్హం. ఇంత దారుణ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్‌ రాజధాని పాట్నా సమీపంలోని కొద్రాకు చెందిన మిథిలేశ్‌ రవిదాస్‌ కుమారుడు సచిన్‌. ఇటీవల కొన్నేళ్ల కిందట కుమారుడికి వివాహమైంది. భర్త, మామతో కలిసి ఆమె జీవిస్తోంది. ఈ క్రమంలో మామ ఆమెపై కన్నేశాడు. మెల్లగా ఆమెకు దగ్గరై వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. అలా మామ, కోడలు కొన్నాళ్లుగా సంబంధం కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులకు కుమారుడికి తన ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఒకసారి తన భార్యకు చేరువగా ఉండడాన్ని గమనించి తండ్రిని నిలదీశాడు. తన భార్యతో తండ్రి సాగిస్తున్న సంబంధం తెలుసుకుని హతాశయుడయ్యాడు. దీనిపై కుటుంబంలో గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో కోడలితో సంబంధానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించి కొడుకు హత్యకు ప్రణాళిక రచించాడు. 

కొడుకు సచిన్‌తో జూలై 7వ తేదీన గొడవపడిన తండ్రి మిథిలేశ్‌ రవిదాస్‌ కొద్దిసేపటికి కత్తితో గొంతుకోసి అతి దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ఓ తోటలో పడేశాడు. అయితే తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి సంఘటనను తప్పుదోవ పట్టించాడు. కొంతమందిపై అనుమానం ఉందని ఓ ఐదుగురి పేర్లు కూడా చెప్పారు. వారిని విచారణ చేస్తుండగానే తండ్రి చేసిన ఘాతుకం బహిర్గతమైంది. నిందితుడు మిథిలేశ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.