భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో గ్రామస్తులు మూక దాడికి పాల్పడి కొట్టి చంపారు. నసీర్ ఖురేషి (40) గా గుర్తించబడ్డాడు, అతని భార్య అఫ్సారీ(35) ను గొడ్డలి తో నరికి పారిపోతున్న సమయంలో కట్టెలు, ఇనుప కడ్డీలను పట్టుకున్న ఆరుగురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు.

ఈ సంఘటన గురించి స్థానిక పోలీసులు తొలుత తమకు సమాచారం అందలేదని చెప్పినప్పటికీ, తరువాత ఆ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోలో చూసిన ఐదుగురిని గుర్తించామని, వారిలో ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.

"ఈ వ్యక్తి నిన్న తన భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అతను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతన్ని గ్రామస్తులు కార్నర్ చేశారు మరియు వారు అతనిపై రాళ్ళు రువ్వారు, దాడి చేశారు. అతను మరణించాడు" అని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ (ఫతేపూర్) శ్రీపాల్ యాదవ్ చెప్పారు.

"నిన్న ఎవరూ వీడియో గురించి ప్రస్తావించలేదు, కాని ఈ రోజు అది వెలుగులోకి వచ్చింది. మేము ఇప్పుడు వీడియోను కూడా పరిశీలిస్తున్నాము" అని ఆయన చెప్పారు.

వీడియో తీస్తున్న సమయంలో వీధుల్లో, సమీప పైకప్పులపై గుమిగూడిన పెద్ద సమూహం మనకు కనిపించినా అతన్ని చచ్చేలా కొడుతుంటే అందరూ నిశ్చేష్ఠులుగా ఉండిపోయారు.  సెల్ఫీలు మరియు వీడియోలను తీసుకున్నారు తప్ప ఆప్ ప్రయత్నం చేయలేదు. 

 సిమౌర్ గ్రామంలోని ఆఫ్సారా తల్లి నివాసంలో ఉంటున్న ఈ జంట తరచు గొడవ [పడుతుండేవారు. గొడవ పడగానే కోపంలో నసీర్ ఖురేషి తన భార్యపై  గొడ్డలితో దాడి చేశాడని ఆరోపించారు. ఆమె అక్కడికక్కడే మరణించింది, ఆమెను రక్షించే ప్రయత్నంలో గాయపడిన ఆమె తల్లి, సోదరి గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్థులు అతడ్ని పట్టుకొని చితక్కొట్టారు. .

నసీర్ ఖురేషి, అతని భార్య ఆఫ్సారా మృతదేహాలను పోస్ట్ మార్టం  కోసం పంపారు. శాంతిభద్రతల పరిరక్షణకు గ్రామంలో అదనపు పోలీసు బృందాలను నియమించారు. ఈ కేసులో ఇతర నిందితులను పట్టుకోవడానికి మ్యాన్‌హంట్‌ను ప్రారంభించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.