ఆన్‌లైన్ మీటింగ్ లో కట్ డ్రాయర్ల షాపింగ్ సైట్ షేర్ చేసిన వ్యక్తి.. పోస్ట్ వైరల్..
ఆన్ లైన్ ఆఫీస్ మీటింగ్ లో కట్ డ్రాయర్ల ట్యాబ్ షేర్ చేశాడో వ్యక్తి. పొరపాటు తెలుసుకుని మార్చుదామంటే సిస్టమ్ హాంగ్ అయ్యింది. దీంతో అతని పరిస్థితి..
కరోనా పుణ్యమా అని వర్క్ ఫ్రం హోం కల్చర్ పెరిగిపోయింది. దీంతో ఆఫీస్ మీటింగ్ కూడా ఆన్ లైన్లో జరుగుతున్నాయి. ఇదే ఓ వ్యక్తి కొంపముంచింది. మీటింగ్ లో తన విండో షేర్ చేయాల్సి వచ్చినప్పుడు అమన్ అనే ఓ ఉద్యోగి షేర్ చేసింది చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే నాలికకరుచుకుని ఆ విండోను క్లోజ్ చేసి.. సారీ చెప్పాడు కానీ.. అప్పటికే అందరూ దాన్ని చూసేశారు.
ఇంతకీ అదేం విండో అంటే.. ఆన్ లైన్ లో ఓ షాపింగ్ సైట్.. అందులో అమన్ అండర్ వేర్లు కొనడానికి చూస్తున్నాడు. రకరకాల అండర్ వేర్లకు సంబంధిన ఫొటోలను కార్ట్ లో యాడ్ చేశాడు. పొరపాటున ఇతను ప్రజెంట్ చేయాల్సిన విండో బదులు అది ఓపెన్ అయ్యింది. అదన్నమాట విషయం..
వీడియో కాల్ అని తెలియక జరిగే ఇలాంటి సరదా అయిన పొరపాట్లు గతంలోనూ వెలుగు చూశాయి. ఓ వ్యక్తి అయితే ఏకంగా వీడియో కాల్ ఆన్ చేసి ఉన్న విషయం మరిచిపోయి స్నానం చేశాడు. మరో వ్యక్తి దుస్తులు మార్చుకున్నాడు. ఇంకొందరు చిలిపి రొమాన్స్ చేయడం... ఇలాంటివన్నీ గతంలో జరిగినవే.
ఇక ఈ విషయాన్ని స్వయంగా అమన్ అనే సదరు ఎంప్లాయే ట్విటర్‌లో స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ.. ‘నాకోసం ప్రార్థించండి ప్లీజ్’ అని క్యాప్షన్ పెట్టాడు. అమన్ తన స్క్రీన్ షేర్ చేసే క్రమంలో ట్యాబ్ లు మారుస్తుండగా ఈ విండో షేర్ అయ్యింది. ఈ పోస్ట్ అధికారిక సమావేశంలో పెద్ద తప్పుగా మారుతుంది. కొద్దిసేపటికే, అమన్ సహోద్యోగులు అతనిని గూఫ్ అప్ గురించి హెచ్చరించి, ట్యాబ్ మార్చమని అడిగారు. అయినప్పటికీ, అతను త్వరగా మార్చలేకపోయాడు. కారణం అతని స్క్రీన్ హ్యంగ్ అయ్యింది.
అమన్ ట్టిట్టర్ లో పెట్టిన ఈ పోస్ట్‌కి 185వేల వ్యూస్ వచ్చాయి. వందలాది కామెంట్స్ వచ్చాయి. ట్వీట్‌పై నెటిజన్లు విపరీతంగా నవ్వుకున్నారు. ఇది చూసి తాము నవ్వు ఆపుకోలేకపోయన్నామంటూ కామెంట్స్ చేశారు. మరి కొంతమంది ఆన్‌లైన్ మీటింగ్‌లో ఇలాంటి పరిస్థితులను తాము ఎలా ఎదుర్కొన్నారో రాశారు. ఇంకొందరు భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.