పాపం ఓ చిన్న పొరపాటు కారణంగా ఆ డెలివరీ అతని తల్లికి చేరింది. ఈ విషయాన్ని అతని సోదరి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్ గా మారింది.
ప్రస్తుతం ప్రతి ఒక్కటీ ఆన్ లైన్ అయిపోయింది. బయటకు వెళ్లి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి, నెట్ సదుపాయం ఉంటే సరిపోతుంది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో కళ్ల ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆన్ లైన్ లో కండోమ్ ప్యాకెట్ ఆర్డర్ చేశాడు. అయితే, పాపం ఓ చిన్న పొరపాటు కారణంగా ఆ డెలివరీ అతని తల్లికి చేరింది. ఈ విషయాన్ని అతని సోదరి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్ గా మారింది.
ఓ వ్యక్తి స్విగ్గీ ఇన్ స్టామార్ట్ లో కండోమ్స్ ఆర్డర్ చేశాడు. అయితే, అందులో అడ్రస్ మార్చడం మర్చిపోయాడు. తాను ఉన్న ప్లేస్ అడ్రస్ పెట్టబోయి, పొరపాటున ఇంటి అడ్రస్ పెట్టేశాడు. ఫలితంగా ఆ ఆర్డర్ ని అతని తల్లి అందుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అతని సోదరి కండోమ్ ప్యాకెట్ ఫోటో తీసి మరి ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేసింది.
"మా అమ్మకి ఇప్పుడే ఇన్‌స్టామార్ట్ ఆర్డర్ వచ్చింది.మా సోదరుడు అడ్రస్ మార్చడం మర్చిపోయినట్లున్నాడు " అని క్యాప్షన్ పెట్టింది.ఈ పోస్ట్ కి 591k పైగా లైకులు రాగా, కామెంట్లు టన్నుల కొద్ది రావడం విశేషం. ఆ తర్వాత అతని పరిస్థతి ఏంటి అని అందరూ అడుగుతుండటం విశేషం. పాపం వాళ్ల అమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.