Mamata Banerjee: మమతా బెనర్జీ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం బెంగాల్ సర్కార్ పంపిన నేతాజీ శకటం నమూనాను తిరస్కరించింది. దీనిపై సీఎం మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Mamata Banerjee: కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోడీ పని తీరుపై మమత బెనార్జీ నిప్పులు చెరిగారు. రిపబ్లిక్ డే పరేడ్ కోసం బెంగాల్ సర్కార్ పంపిన శకటాన్ని తిరస్కరించింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బెంగాల్ సర్కార్.. సుబాష్ చంద్రబోస్ 125 వ జయంతిని పురస్కరించుకోని ఆయన సేవలను స్మరించుకునేలా శకటాన్ని ప్రతిపాదించింది. అయితే.. బెంగాల్ సర్కార్ పంపిన ఆ నమునాను కేంద్రం తిరస్కరించింది. దీంతో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
కేంద్రం నిర్ణయంపై బెంగాల్ ప్రజలు బాధపడుతున్నారని.. ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బెంగాల్ రాష్ట్ర శకటాన్ని తిరస్కరించడాన్ని తీవ్రంగా ఖండించింది. పశ్చిమ బెంగాల్ ప్రతిపాదించిన శకటాన్ని రిపబ్లిక్ డే రోజున ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని, మరో సారి తాము పంపిన శకటాన్ని పునఃపరిశీలన చేయాలని ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు.
సుబాష్ చంద్రబోస్ 125 జయంతిని పురస్కరించుకోని శకటాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఎటువంటి కారణాలు లేకుండా శకటాన్ని తిరస్కరించడం సరికాదని లేఖలో పేర్కొంది. ఎలాంటి కారణాలు లేకుండా.. ఎలాంటి సమర్థనలు ఇవ్వకుండానే శకటాన్ని తిరస్కరించడం దిగ్భ్రాంతిని కలిగిస్తోందని లేఖలో పేర్కొంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీని గుర్తు చేసేలా, ఆయన సేవలను స్మరించుకునేలా రూపొందించమని మమతా పేర్కొన్నారు.
ఇందులో స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, చిత్తరంజన్ దాస్, శ్రీ అరబిందో, విద్యాసాగర్, మాతంగిని హజ్రా, బిర్సా ముండా, నజ్రుల్ ఇస్లాం వంటి వారి చిత్రాలను కూడా ఉంచినట్లు పేర్కొనారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించి 75 ఏళ్ల స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల వేళ జరిగే గణతంత్ర పరేడ్‌లో బంగాల్‌కు చెందిన స్వాతంత్ర సమరయోధుల శకటాన్ని చేర్చాలని కోరారు. గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో పశ్చిమ బెంగాల్‌తో పాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన శకటాన్ని నిరాకరించింది.
ఆది శంకరాచార్యుల శకటాన్ని రూపొందించాలని కేంద్ర సర్కార్ కోరగా.. కేరళ ప్రభుత్వం మాత్రం శ్రీ నారాయణ గురు ఆధారంగా.. శకటాన్ని రూపొందించింది. ఇందులో సంఘ సంస్కర్త శ్రీనారాయణ గురు , జటాయు పార్క్ స్మారక చిహ్నంపై కేరళ పంపిన ప్రతిపాదనలను మోదీ సర్కార్ తిరస్కరించింది.
