Asianet News TeluguAsianet News Telugu

ఇది ప్రభుత్వ ప్రతీకార వైఖరి.. టీఎంసీ నేత అరెస్ట్ పై మమతా బెనర్జీ ఆగ్రహం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించారు. మమతా బెనర్జీ  మాట్లాడుతూ.. ప్రధానికి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేస్తారు. మరి తనకు వ్యతిరేకంగా చాలా మంది  ట్వీట్లు చేశారు. ఇది ఖండించదగిన ఘటన అని అన్నారు.

Mamata condemns TMC leader Saket Gokhales arrest
Author
First Published Dec 6, 2022, 6:02 PM IST

మోర్బీ బ్రిడ్జి ప్రమాదం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మోర్బీ పర్యటనకు సంబంధించిన ఫేక్ న్యూస్‌ను సమర్థిస్తూ చేసిన ట్వీట్‌పై గుజరాత్ పోలీసులు TMC అధికార ప్రతినిధి సాకేత్ గోఖలేను అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ సెల్ అధికారులు ఇవాళ  ఉదయం రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి గోఖలేను అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్ క్రైమ్) జితేంద్ర యాదవ్ మంగళవారం తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ మోర్బీ పర్యటనపై ఆసత్య ప్రచార చేశారనే ఆరోపణలపై గత రాత్రి గుజరాత్ పోలీసులు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధికార ప్రతినిధి సాకేత్ గోఖలేను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించింది. విలేకరులతో మమత మాట్లాడుతూ.. టీఎంసీ నేతను అరెస్టు చేయడం విచారకరమని అన్నారు. సాకేత్ చాలా ముఖ్యమైన, తెలివైన వ్యక్తి.

అతను కేవలం ఒక వార్తను ఉటంకించి.. ప్రధానికి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన కారణంగానే గుజరాత్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారని అన్నారు. తనకు  వ్యతిరేకంగా చాలా మంది ట్వీట్లు చేస్తున్నారనీ, ఇక నుంచి సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ ఆ ట్వీట్లు, వ్యక్తిగత దాడులన్నింటినీ తప్పనిసరిగా పరిశీలించాలని దీదీ డిమాండ్ చేశారు. మోర్బి వంతెన కూలిపోవడం చాలా పెద్ద దుర్ఘటన అని, అందుకే తమ పార్టీ నేత ఆ విషయాన్ని ఉటంకించారని అన్నారు. ఇది ప్రభుత్వ ప్రతీకార వైఖరి అని టీఎంసీ అధినేత్రి అన్నారు.

మోర్బీ బ్రిడ్జి ప్రమాదం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మోర్బీ పర్యటనకు సంబంధించిన ఫేక్ న్యూస్‌ను సమర్థిస్తూ చేసిన ట్వీట్‌పై గుజరాత్ పోలీసులు TMC అధికార ప్రతినిధి సాకేత్ గోఖలేను అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ సెల్ అధికారులు ఈ ఉదయం రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి గోఖలేను అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్ క్రైమ్) జితేంద్ర యాదవ్ మంగళవారం తెలిపారు.


గోఖలేపై ఎఫ్ఐఆర్

మోర్బీలో ప్రధాని పర్యటనపై తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు గోఖలేపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు జితేంద్ర యాదవ్ తెలిపారు. మంళగవారం ఉదయం జైపూర్‌లో అతనిని అదుపులోకి తీసుకున్నామనీ, తదుపరి చట్టపరమైన చర్యల కోసం అతన్ని అహ్మదాబాద్‌కు తీసుకువచ్చామని తెలిపారు. కోవిడ్-19కి సంబంధించిన విచారణ అనంతరం అతడిని అధికారికంగా అరెస్టు చేస్తామని చెప్పారు. అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని 465, 469, 471 (ఫోర్జరీకి సంబంధించినవి), 501 (పరువునష్టం) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి అధికార ప్రతినిధి గోఖలే (35) ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారని, వ్యక్తిగత పర్యటన కోసం జైపూర్‌కు వెళ్లారని వర్గాలు తెలిపాయి.
 

గోఖలే ఇటీవల ట్విటర్‌లో ఒక ప్రముఖ గుజరాతీ వార్తాపత్రికలో ప్రచురించబడిన వార్తను పంచుకున్నారు.ప్రధాని మోదీ మోర్బీ పర్యటనకు గుజరాత్ ప్రభుత్వం రూ.30 కోట్లు ఖర్చు చేసిందని సమాచార హక్కు (ఆర్‌టీఐ) కింద దాఖలు చేసిన దరఖాస్తుకు ప్రతిస్పందనగా వెల్లడించినట్టు ఆ కథనంలో ఉంది.  ఈ వార్తను పంచుకుంటూ.. ప్రధాని మోదీ మోర్బీ పర్యటనకు.. గుజరాత్ రాష్ట్రప్రభుత్వం కొన్ని గంటల్లో రూ. 30 కోట్లు ఖర్చు చేసినట్లు ఆర్టీఐలో తేలిందని గోఖలే రాశారు.

135 మంది అమాయకుల ప్రాణాల కంటే మోదీ కార్యక్రమ నిర్వహణ, ‘పీఆర్‌’ ఖర్చు ఎక్కువ అని పేర్కొన్నాడు. ఇంతలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో గోఖలే చేసిన వార్తా నివేదికలు, వాదనలను "నకిలీ" అని పేర్కొంది, అలాంటి RTI ప్రతిస్పందన ఏదీ ఇవ్వబడలేదని పేర్కొంది. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో బ్రిటిష్ కాలం నాటి వేలాడే వంతెన అక్టోబర్ 30 సాయంత్రం కూలిపోయి 135 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక కేబుల్ తెగిపోవడంతో వంతెన కూలిపోయినప్పుడు కనీసం 250 నుండి 300 మంది వరకు ఉన్నారని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios