కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఓడిన వారంతా పరాజితులు కారణి దీనిపై తాము సమీక్షించిన తర్వాత తమ అభిప్రాయాలు వ్యక్తం చేశామని మమత ట్వీట్ చేశారు. 

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన వీవీ ప్యాట్ ల లెక్కింపు సరిపోల్చే వరకు వేచి చూడాలని ఆమె వ్యాఖ్యానించారు. ఇకపోతే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. మేజిక్ ఫిగర్ ని సైతం దాటి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. 

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఊహించని రీతిలో బెంగాల్ లో బీజేపీ దూసుకుపోతుంది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటుంది. బెంగాల్ లో 42 లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ ఏకంగా 18 నియోజకవర్గాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా టీఎంసీ 23 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీ ఖంగుతిన్నారు.