Asianet News TeluguAsianet News Telugu

ఒడిశా రైలు ప్రమాదంపై స్పందిన మమతా బెనర్జీ.. అత్యవసర నంబర్‌ను జారీ.. ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ యాక్టివేట్..

ఒడిశా రైలు ప్రమాదం: బాలాసోర్ రైలు ప్రమాదానికి సంబంధించి సీఎం మమతా బెనర్జీ అత్యవసర నంబర్‌ను జారీ చేశారు, బృందాన్ని సంఘటనా స్థలానికి పంపారు
 

Mamata Banerjee responded to the Odisha train accident Emergency control room activated KRJ
Author
First Published Jun 2, 2023, 11:47 PM IST

ఒడిశాలోని బాలాసోర్‌లోని బహనాగాలో శుక్రవారం సాయంత్రం గూడ్స్ రైలును ఢీకొనడంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. కోల్‌కతా సమీపంలోని షాలిమార్ స్టేషన్ నుండి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్‌కు వెళ్తుండగా రాత్రి 7.20 గంటల ప్రాంతంలో బహంగా బజార్ స్టేషన్‌లో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా మృతి చెందగా, దాదాపు 200 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను సోరో, గోపాల్‌పూర్‌, ఖంట‌పాడ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు త‌ర‌లించారు. క్షత‌గాత్రుల్లో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. క్షత‌గాత్రుల సంఖ్యకు కూడా పెరిగే అవకాశముంది.   


కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో హెల్ప్‌లైన్ నంబర్‌లు, రెస్క్యూ ఆపరేషన్‌ల గురించి తెలియజేశారు. ఈ ప్రమాదంపై మమతా బెనర్జీ ట్విట్ చేస్తూ.. "ఈ సాయంత్రం పశ్చిమ బెంగాల్ నుండి ప్రయాణీకులను తీసుకెళ్తున్న షాలిమార్-కోరోమాండల్ ఎక్స్‌ప్రెస్ బాలాసోర్ సమీపంలో గూడ్స్ రైలు ప్రమాదం గురైంది. బెంగాల్ కు చెందిన ప్రయాణీకులు కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు" అని పేర్కొన్నారు.

అలాగే.. మరో ట్వీట్ లో  "మేము (బెంగాల్ ప్రభుత్వం) 5-6 మంది సభ్యుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపుతున్నాము, వారందరూ ఒడిశా ప్రభుత్వానికి, రైల్వే అధికారులకు సహకరిస్తారు. సహాయక చర్యలలో సహాయం చేస్తారు. నేను ప్రధాన కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులతో వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను" అని సిఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో బెంగాల్ సర్కార్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ను యాక్టివేట్ చేసింది. సౌత్ ఈస్టర్న్ రైల్వేతో సమన్వయం చేసుకుంటున్నామని సీఎం మమత తెలిపారు.ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నంబర్ 033- 22143526/22535185 గా పేర్కొన్నారు. రెస్క్యూ, రికవరీ, సహాయం, సహాయం కోసం అన్ని ప్రయత్నాలు ప్రారంభించబడ్డాయని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios