కోల్‌కత్తా: నందిగ్రామ్ లో రీ కౌంటింగ్ నిర్వహించాలని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ డిమాండ్ చేశారు. సోమవారం నాడు  కోల్‌కత్తాలో ఆమె మీడియాతో మాట్లాడారు.ఈవీఎంలు మార్చి రిగ్గింగ్ చేశారని ఆమె ఆరోపించారు. ఈ స్థానంలో తొలుత మమత బెనర్జీ విజయం సాధించారని ప్రచారం సాగింది. అయితే ఆ తర్వాత  సువేందు అదికారి విజయం సాధించినట్టుగా  ఈసీ ప్రకటించింది. ఈ విషయమై ఆమె ఇవాళ మరోసారి స్పందించారు. ఈసీ తీరును ఆమె తప్పుబట్టారు. కోర్టుకు వెళ్తానన్నారు. 

also read:నందిగ్రామ్ లో సువేందుపై ఓటమి: కోర్టుకెక్కనున్న మమతా బెనర్జీ

త్వరలోనే  అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తానని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రకటించారు. ఇవాళ సాయంత్రం గవర్నర్ ను కలవనున్నట్టుగా ఆమె చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై గవర్నర్ తో మమత బెనర్జీ చర్చించనున్నారు. ఎవరూ హింసను ప్రేరేపించవద్దని ఆమె కోరారు. కొందరు పోలీసులు బీజేపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆరోపించారు. 

బెంగాల్ రాష్ట్రంలో వరుసగా మూడోసారి టీఎంసీ అధికారాన్ని కైవసం చేసుకొంది. బెంగాల్ లో అధికారం కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. కానీ అధికారానికి చాలా దూరంలో ఆ పార్టీ నిలిచిపోయింది. అయితే గతంలో కంటే  అధిక స్థానాలను  బీజేపీ కైవసం చేసుకొంది.