కరోనా వైరస్ పై పోరులో భాగంగా మూడవదఫా లాక్ డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగుస్తున్న వేళ... లాక్ డౌన్ ఎత్తివేతకు సంబంధించి నేడు ప్రధానమంత్రి అన్ని రాష్ట్రల ముఖ్యమంత్రులతో మధ్యాహ్నం మూడు గంటల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. 

ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా మాట్లాడడానికి అవకాశం కల్పించనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఇకపోతే నేడు జరిగుతున్న ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయినట్టు సమాచారం. 

ఈ కరోనా వైరస్ కష్టకాలాన్ని రాజకీయాలు చేయడానికి వాడుతున్నారని, కేంద్రం ఇదంతా ఒక పథకం ప్రకారం చేస్తుందని ఆమె ఆరోపించారు. ఈ కరోనా వైరస్ విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడడం లేదని, కనీసం తమకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించినట్టు తెలియవస్తుంది. 

ఇకపోతే... కరోనాను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎంలతో  మోడీ చర్చించనున్నారు. రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై మోడీ చర్చించనున్నారు. 

లాక్ డౌన్ సమయంలో  రాష్ట్రాల ముఖ్యమంత్రులతో  ప్రధాని మోడీ  వీడియో కాన్పరెన్స్ నిర్వహించడం ఇది ఐదోసారి. లాక్ డౌన్ నుండి ఎలా బయటకు రావాలనే విషయమై కూడ ఆయా రాష్ట్రాల సూచనలు, సలహాలను ప్రధాని తీసుకొనే అవకాశం ఉంది.

ఆదివారం నాడు ఆయా  రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. వలస కూలీలను స్వగ్రామాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేశారు. ఇంకా చాలా రాష్ట్రాల్లో వలస కూలీలు తమ రాష్ట్రాలకు చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రాలు ఆర్ధిక సహాయాన్ని కూడ కోరుతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలు ఆర్ధికంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని కోరుతున్నాయి.ఈ విషయమై కేంద్రం కసరత్తు చేస్తోంది.ఈ విషయమై ఈ సమావేశంలో రాష్ట్రాల నుండి మరోసారి కేంద్రం ముందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా వ్యాప్తి చెందకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే విషయమై కూడ చర్చించే అవకాశం ఉంది.