Asianet News TeluguAsianet News Telugu

షాపింగ్ మాల్స్ పై కరోనా ప్రభావం.. భారీగా తగ్గిన లాభాలు

 కరోనా కంటే ముందుతో పోలిస్తే ఈ వృద్ధి 80–85 శాతానికే చేరుతుందని తెలిపింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో షాపింగ్‌ మాల్స్‌లో ఆరోగ్యకరమైన వృద్ధి ఉన్నప్పటికీ.. మాల్స్‌ ఆదాయం మాత్రం కోవిడ్‌-19 కంటే ముందు స్థాయికి చేరుకోలేదని పేర్కొంది.

Malls Revenues To Remain Lower Than Pre-Pandemic Levels This Fiscal, Says Report
Author
Hyderabad, First Published Apr 15, 2021, 11:25 AM IST

కరోనా మహమ్మారి మరోసారి దేశాన్ని కుదేలు చేస్తోంది. దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24గంటల్లో 2లక్షల మందికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో గరిష్టంగా నిన్ననే కేసులు నమోదవ్వడం గమనార్హం. అయితే.. ఈ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం.. షాపింగ్ మాల్స్ పై బాగా పడిందని నిపుణులు చెబుతున్నారు.

మహమ్మారి కారణంగా గతేడాది దేశంలో షాపింగ్‌ మాల్స్‌ ఆదాయం 45 శాతం క్షీణించిందని.. 2022 ఆర్ధిక సంవత్సరంలో మాత్రం 45-55 శాతం మేర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది.  కరోనా కంటే ముందుతో పోలిస్తే ఈ వృద్ధి 80–85 శాతానికే చేరుతుందని తెలిపింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో షాపింగ్‌ మాల్స్‌లో ఆరోగ్యకరమైన వృద్ధి ఉన్నప్పటికీ.. మాల్స్‌ ఆదాయం మాత్రం కోవిడ్‌-19 కంటే ముందు స్థాయికి చేరుకోలేదని పేర్కొంది.

కరోనా సెకండ్‌ వేవ్‌ ఆంక్షలు షాపింగ్‌ మాల్స్‌లో రిటైల్‌ అమ్మకాల మీద మాత్రమే ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని, బలమైన స్పాన్సర్లు, ఆరోగ్యకరమైన లిక్విడిలీ ప్రొవైల్స్‌ కారణంగా మాల్స్‌ రుణ సేవా సామరŠాధ్యలు ప్రభావితం కావని తెలిపింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రిటైల్‌ అమ్మకాలు క్రమంగా కోలుకుంటాయని సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేథీ చెప్పారు. ఈ అమ్మకాలు ప్రీ-కోవిడ్‌లో 90 శాతానికి చేరువవుతాయని ఇది అద్దె మాఫీకి హామీ ఇవ్వకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో షాపింగ్‌ మాల్‌ యజమానుల అద్దె ఆదాయం మీద ప్రభావాన్ని తగ్గిస్తుందని చెప్పారు. 

రిటైల్‌ అమ్మకాల రికవరీ ఏకరీతిన ఉండదు. 14 రేటింగ్‌ ఉన్న మాల్స్‌లో మరీ ముఖ్యంగా దేశంలోని మాల్స్‌ మొత్తం ఆదాయంలో 35-40 శాతం వాటా ఉన్న మహారాష్ట్రలో ప్రస్తుత మినీ లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువగా ప్రభావితం అవుతాయని తెలిపింది. 2021 ఆర్ధిక సంవత్సరంలో మాల్స్‌లోని మొత్తం రిటైల్‌ విక్రయాలు 55శాతం మేర క్షీణించాయని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios