రాజ్యసభలో ప్రతిపక్షనేతగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే వ్యవహరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోదముద్ర వేశారు.

రాజ్యసభలో ప్రతిపక్షనేతగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే వ్యవహరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోదముద్ర వేశారు.

ఇప్పటి వరకు ప్రతిపక్షనేతగా వ్యవహరించిన గులాంనబీ ఆజాద్ పదవీ కాలం ముగియడంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. మల్లికార్జున ఖర్గే గతంలో లోక్ సభలో ప్ర‌తి పక్ష నాయకుడిగా ఉన్న విష‌యం తెలిసిందే.

కాగా, రాజ్యసభ సభ్యుడిగా ఆజాద్ 2009 నుంచి కొనసాగుతూ, 2014 నుంచి ప్ర‌తి పక్షనేతగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత విధేయుల్లో ఒకరైన మల్లికార్జున్‌ ఖర్గేకు రాహుల్‌గాంధీతో మంచి సాన్నిహిత్యం ఉంది.

కర్ణాటకకు చెందిన ఈ దళిత నేత 2014-19 మధ్య లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా ఉన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు కనీస సంఖ్యాబలం లేకపోవడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదు. కాగా.. తొలుత ఈ పదవికి ఖర్గేతో పాటు దిగ్విజయ్‌ సింగ్‌, ఆనంద్‌ శర్మ, చిదంబరం, కపిల్‌ సిబల్‌ వంటి కీలక నేతల పేర్లు వినిపించాయి.