చెన్నై: విమానంలో ఓ ప్రయాణీకుడు తన ఒంటిపై ఉన్న దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా తిరిగాడు. దీంతో ప్రయాణీకులు షాక్‌కు గురయ్యారు. ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు అతడిని  భద్రతా సిబ్బందికి అప్పగించారు విమాన సిబ్బంది.

దుబాయ్ -లక్నో ఎయిరిండియా విమానంలో ఈ ఘటన శనివారం నాడు చోటు చేసుకొంది.ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణీకుడు ఉన్నట్టుండి తన ఒంటిపై ఉన్న దుస్తులను విప్పేసీ విమానంలో  తిరిగాడు.

దీంతో విమాన సిబ్బంది అతడిని సీట్లో కూర్చోబెట్టి  దుప్పటి కప్పారు. విమానం లక్నో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే  అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అర్ధాంతరంగా  దుస్తులన్నీ ఎందుకు విప్పాల్సి వచ్చిందో పోలీసులు ఆరా తీస్తున్నారు.