మనుషులు మానవత్వాన్ని కోల్పోతున్నారు. ఆడవాళ్లు కనిపిస్తే చాలు ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది కూడా మరిచిపోయి కామవాంఛ తీర్చుకునే మృగాళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. అలాంటి దారుణ సంఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది. 

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మనిషి పై జాలి దయ చూపించాల్సింది పోయి దారుణానికి పాల్పడ్డాడు ఓ మృగాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై అక్కడి మగ నర్సు అత్యాచారానికి ఒడిగట్టాడు. రాజస్థాన్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది.

అనారోగ్యంతో ఉన్న ఓ బాధితురాలు ఐసీయూలో చికిత్స పొందుతుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న మగ నర్సు ఆ మహిళకు మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో సృహ కోల్పోయిన మహిళపై సోమవారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ మృగాడు. 

ఇంజక్షన్ ఇవ్వడం వల్ల జరిగే దారుణం గురించి ఆమెకు తెలుస్తున్నప్పటికీ ప్రతిఘటించలేకపోయింది. ఆ మరుసటి రోజు తనని చూడడానికి వచ్చిన భర్త తో జరిగిన దారుణం గురించి పేపర్ మీద రాసి తెలిపింది. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సదరు నర్స్ ను అరెస్ట్ చేశారు.