యువతీ యువకులు ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. రహస్యంగా గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. వారి ప్రేమను ఇంట్లో అంగీకరించరని తెలిసి... పెద్దలు చెప్పిన మరో పెళ్లికి సిద్ధపడింది. అంతే.. తనను ప్రేమించి పెళ్లి చేసుకొని మరో వ్యక్తితో మరో పెళ్లికి రెడీ అయ్యిందనే కోపంతో... ప్రియురాలిని ప్రియుడు అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  విజయపుర జిల్లా సింధగికి చెందని సందీప్ రాథోడ్ ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గత ఏడాది ఫేస్ బుక్ ద్వారా సందీప్ కి అంజనా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పలు మార్లు ఇద్దరూ బయట కలిశారు కూడా. ఇంట్లో తెలీకుండా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి మంగళూరులో లాడ్జిలో ఉండేవారు.

ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఉద్యోగ విషయంగా ఘర్షణ జరిగింది. దీంతో యువతి పుట్టింటికి వెళ్లిపోయింది.  పుట్టింటికి వెళ్లిన అంజనాకు మరో వ్యక్తితో పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. వారు చెప్పిన దానికి యువతి కూడా అంగీకరించింది. విషయం తెలుసుకున్న సందీప్... అంజనాపై కోపంతో ఊగిపోయాడు. తనను కాదని మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధపడ్డావా అంటూ ఆమెతో మరోసారి గొడవపడ్డాడు. అనంతరం గొంతుకి వైర్ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. కాగా... పోలీసులు నిందితుడిని అరెస్టు చేయగా... హత్య తానే  చేసినట్లు అంగీకరించాడు.