Asianet News TeluguAsianet News Telugu

చెన్నై ఐఐటీలో కరోనా కలకలం... మళ్లీ లాక్‌డౌన్..

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గడం లేదు. ఇప్పటికే ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా చెన్నై ఐఐటీలో కరోనా విజృంభించింది.

Major outbreak of coronavirus inside IIT Madras, campus placed under lockdown - bsb
Author
Hyderabad, First Published Dec 14, 2020, 11:18 AM IST

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గడం లేదు. ఇప్పటికే ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా చెన్నై ఐఐటీలో కరోనా విజృంభించింది.

చెన్నై ఐఐటీ ‍ క్యాంపస్‌లో ఒక‍్కసారిగా 71 మందికి కరోనా బారినపడ్డారు.    ఇందులో  66 మంది విద్యార్థులున్నారని ఐఐటీ అధికారులు తెలిపారు. ఎక్కడ నుంచి విస్తరించిందోతెలియదుగానీ,  కేవలం ఒక్కరోజులోనే 32 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని క్యాంపస్ అధికారులు తెలిపారు. 

వచ్చే రెండు రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున  క్యాంపస్‌లోని విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం ఇనిస్టిట్యూట్‌కు సూచించింది. యూనివర్సిటీలో 774 మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం క్యాంపస్‌లో మళ్లీ లాక్‌డౌన్ నిబంధనలను అమలులోకి తెచ్చామని, అన్ని డిపార్టుమెంట్లను మూసివేస్తున్నట్లు తెలిపారు.

ఐఐటీ  చెన్నై ఆదివారం జారీ చేసిన అధికారిక సర్క్యులర్  ప్రకారం  కోవిడ్ కేసులు పెరిగిన దృష్ట్యా, తదుపరి నోటీసులిచ్చే వరకు అన్ని విభాగాలు, కేంద్రాలు, లైబ్రరీని వెంటనే మూసివేయాలని నిర్ణయించారు. అధ్యాపకులు, సిబ్బంది, ప్రాజెక్ట్ సిబ్బంది,  పరిశోధకుల తదితరులు ఇంటి నుండే పని చేస్తారు. 

క్యాంపస్‌లో బస చేసే విద్యార్థులు, ప్రాజెక్ట్ సిబ్బంది అందరూ తమ హాస్టల్ గదులకు మాత్రమే పరిమితం కావాలి.  భౌతిక దూరం, ఫేస్‌మాస్క్‌ లాంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. కోవిడ్ లక్షణాలు కనిపించినవారు తక్షణమే అధికారులను సంప్రదించాలని సర్క్యులర్‌లో పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios