న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలోని మెట్రో ఆసుపత్రిలో గురువారం నాడు అగ్ని ప్రమాదం వాటిల్లింది. ఆసుపత్రిలో ఉన్న రోగులను అగ్నిమాపక సిబ్బంది రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

గురువారం నాడు మధ్యాహ్నం ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ విషయం తెలుసుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

ఆసుపత్రి అద్దాలను ధ్వసం చేసి రోగులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.