బీహార్ రాష్ట్రంలో  ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. గంగానదిలో జీపు బోల్తా పడింది.ఈ ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు.. పాట్నా జిల్లాలోని  పీపాపుల్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకంది.  నదిలో జీపు బోల్తా పడిన సమయంలో  జీపులో సుమారు 15 మంది ప్రయాణిస్తున్నారు. నదిలో పడినవారిలో 10 మంది మృత్యువాతపడినట్టుగా అధికారులు ప్రకటించారు.  మృతదేహలను నది నుండి బయటకు తీస్తున్నారు.


&nbs

p;

 

ఈ ఘటనలో గల్లంతైన వారి కోసం  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.జీపులో  ప్రయాణీస్తున్న వారంతా  ఒకే కుటుంబానికి చెందినవారేనని అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి తెలియగానే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని  సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. జీపు గంగానదిలో పడిపోవడానికి గల కారణాలపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.  డ్రైవర్ నిర్లక్ష్యమా ప్రమాదవశాత్తు జీపు నదిలో పడిపోయిందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.