ఇంట్లో పనిచేయడం కోసం వచ్చి.. ఏకంగా యజమానురాలి బెడ్రూంలోనే స్పై కెమెరా పెట్టాడో పనివాడు. ఆ వీడియోలతో యజమానిమీద బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నాడు. 

గురుగ్రాం : ఇంట్లో పని చేసే వ్యక్తి ఏకంగా యజమాని బెడ్ రూమ్ లోనే సీక్రెట్ కెమెరా అమర్చిన షాకింగ్ ఘటన గురుగ్రాంలో వెలుగు చూసింది. ఈ మేరకు ఆ మహిళ యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత బెడ్ రూమ్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను సేకరించిన ఆ పనిమనిషి వాటిని సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. రూ.లక్షలు ఇవ్వాలని లేకుంటే వాటిని వైరల్ చేస్తానని బెదిరించాడు. 

దీంతో ఏం చేయాలో తోచని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఫిర్యాదులో ఆమె పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి… పనిమనిషి కోసం ఓ ప్లేస్మెంట్ ఏజెన్సీ ద్వారా కొద్ది రోజుల క్రితం ప్రస్తుతం ఉన్న వ్యక్తిని నియమించుకున్నారు. అతను ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్రూంలో స్పై కెమెరాను ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత వారి ప్రైవేటు వీడియోలను సేకరించాడు. ఈ విషయం యజమానికి తెలియదు. గతవారం ఇల్లు శుభ్రం చేద్దామని చేస్తుండగా.. సీక్రెట్ కెమెరా యజమానురాలి కంట పడింది. 

కనికరించని అంబులెన్స్ సిబ్బంది.. ఐదు నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని .. 200 కిలోమీటర్లు ప్రయాణం.

దీంతో వెంటనే పనిమనిషిని ఆరా తీసి.. పనిలో నుంచి తీసేసింది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే బాగుండదని, పరువు పోతుందన్న భయంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే, పని మానేసి వెళ్లిపోయిన పనిమనిషి.. ఆ వీడియోలతో యజమానిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తనకు రూ. రెండు లక్షలు ఇవ్వాలని లేకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో, ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడైన పనిమనిషి శుభం కుమార్ ను అరెస్టు చేయడానికి సిద్ధపడ్డారు.