Asianet News TeluguAsianet News Telugu

Mahatma Gandhi Jayanti : గాంధీజీ మహోన్నత ఆశయాలు లక్షలాది మందికి ఆదర్శనీయం.. నివాళులర్పించిన మోడీ..

"గాంధీ జయంతి నాడు.. పూజ్యులైన బాపుజీకి నమస్కరిస్తున్నాను. ఆయన మహోన్నత ఆశయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక లక్షలాది మందికి మార్గనిర్దేశనం చేస్తాయి, బలాన్ని ఇస్తాయి" అని మోదీ అన్నారు.

Mahatma Gandhi's noble principles give strength to millions, says PM Modi on Gandhi Jayanti
Author
Hyderabad, First Published Oct 2, 2021, 9:23 AM IST

న్యూఢిల్లీ : ఈరోజు (అక్టోబర్ 2, 2021) (October 2nd)మహాత్మాగాంధీ జయంతి (Mahatma Gandhi Jayanti )సందర్భంగా, ఆయన మహోన్నత ఆశయాలు లక్షలాది మందికి బలాన్ని ఇస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌ లో పోస్ట్ చేస్తూ, "గాంధీ జయంతి నాడు.. పూజ్యులైన బాపుజీకి నమస్కరిస్తున్నాను. ఆయన మహోన్నత ఆశయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక లక్షలాది మందికి మార్గనిర్దేశనం చేస్తాయి, బలాన్ని ఇస్తాయి" అని మోదీ అన్నారు.

మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. విలువలు, సూత్రాలపై ఆధారపడిన శాస్త్రి జీవితం ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు.

ఆ తరువాత, ప్రధాన మంత్రి జల జీవన్ మిషన్ యాప్‌ని ప్రారంభిస్తారు.  వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జల్ జీవన్ మిషన్‌లో గ్రామ పంచాయితీలు, పానీ సమితులు/ గ్రామ నీరు, పారిశుద్ధ్య కమిటీలతో (VWSC) సంభాషిస్తారు.

గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా కవరట్టి (లక్షద్వీప్) లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కూడా ఈరోజు 'గాంధీ గతం కాదు, భవిష్యత్తు కూడా' అనే అంశంపై సెమినార్‌ని నిర్వహించాల్సి ఉంది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవం కింద ఎర్ర కోట నుండి జాతీయ భద్రతా దళాల 'ఆల్ ఇండియా కార్ ర్యాలీ'ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఇక వీటితో పాటు.. 
గుజరాత్ : మహాత్మా గాంధీ 152 వ జయంతి సందర్భంగా సబర్మతి ఆశ్రమంలో ప్రార్థన సమావేశం జరిగింది.

ఢిల్లీ: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు.

Follow Us:
Download App:
  • android
  • ios