మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. తమ ప్రేమను ఒప్పుకోవడం లేదన్న అక్కసుతో 12 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు.
స్త్రీలను గౌరవించాలని ప్రపంచ దేశాలకు చెప్పిన మనదేశంలో మహిళలు, అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. చిన్న,పెద్ద, ముసలి, ముతకా అనే తేడా లేకుండా ఆడవారిపై ఆఘాత్యాలకు పాల్పడుతున్నారు. మనిషి అనే విషయాన్ని మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఎన్ని కఠిన చట్టాలను తీసుకవచ్చిన ఫలితం లేకుండా పోతోంది. తమకు అడ్డే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తమ ప్రేమను ఒప్పుకోవడం లేదన్న అక్కసుతో 12 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో బుధవారం సాయంత్రం దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికను ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు. తల్లీ,కూతురు కలిసి కల్యాణ్‌లోని దుర్గా దర్శన్ సొసైటీకి వెళ్తుండగా నిందితుడు బాలికపై దారుణంగా దాడి చేశాడు. ఆ నిందితుడు బాధిత బాలికను కనీసం 8- 10 సార్లు కత్తితో పొడిచాడు. ఈ క్రమంలో బాధిత బాలిక సహాయం కోసం అరిచింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు దాడి చేసిన వ్యక్తిని అక్కడికక్కడే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలికను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో గత (బుధవారం)
సాయంత్రం 20 ఏళ్ల యువకుడు 12 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపి ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ఆ మైనర్ బాలిక తన ప్రేమ ప్రతిపాదనను అంగీకరించలేదనే అక్కసుతో ఇంతటీ దారుణానికి పాల్పడ్డాడని, ఆ బాలికను తన తల్లి ఎదుటే కత్తితో దాడి చేసి హతమార్చడాన్ని పోలీసులు తెలిపారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తన తల్లితో కలిసి కోచింగ్ క్లాస్ నుండి తిరిగి వస్తుండగా మెట్లపై ఆదిత్య ఆమెను కలిశాడని చెప్పారు. ఈ క్రమంలో బాలిక తల్లిని తోసేసి కత్తితో బాలికను ఎనిమిది నుంచి పది సార్లు పొడిచాడు. ఆకస్మిక దాడితో షాక్‌కు గురైన తల్లి సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించింది. బాలిక స్పృహ తప్పి పడిపోయిన వెంటనే ఆదిత్య ఆత్మహత్య చేసుకునేందుకు ఫినైల్ తాగాడు. ఆసుపత్రిలో చేర్పించారు.ఈ విషయంపై మృతురాలి బంధువులు మాట్లాడుతూ నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.
