ముంబైలో దారుణం జరిగింది. ఓ మహిళ మీద అత్యాచారం చేసి, అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని భూగర్బ డ్రైనేజీ దగ్గర పారేసి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

అత్యంత పాశవికమైన ఈ సంఘటన మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో సంపన్నులు నివసించే బాంద్రాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చౌరస్తా మధ్యలో ఉన్న డ్రైనేజి వద్ద కొందరు మహిళ శవాన్ని గుర్తించారు.

ముంబైలోని mtnl జంక్షన్ సమీపంలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద ఉన్న డ్రైనేజి దగ్గర స్థానికులు ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. 

అక్కడ వైద్యపరీక్షల్లో మహిళ హత్యకు ముందు మీద అత్యాచారారి్ి గురైనట్టు వైద్యులు నిర్ధారించారు. జననాంగాల వద్ద తీవ్రంగా గాయాలైనట్లు వైద్యులు తమ నివేదికలో తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 376 (అత్యాచారం), 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. హత్యకు గురైన ఆ మహిళ ప్రాస్టిట్యూట్ అని తెలిసింది. నగదు సంబంధించిన విషయంలో గొడవ జరిగి హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఆమెను పిలిపించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే ఇది క్షణికావేశంతో చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.