Asianet News TeluguAsianet News Telugu

బాబా ఆమ్టే మనవరాలి ఆత్మహత్య.. కారణమదేనా...

ప్రముఖ సామాజిక కార్యకర్త బాబా అమ్టే మనవరాలు షీతల్ ఆమ్టే ఆత్మహత్య చేసుకున్నారు. బాబా ఆమ్టే కొడుకు డాక్టర్ వికాస్ ఆమ్టే కూతురు షీతల్ ఆమ్టే కరాజ్గి. సోమవారం ఆమె చంద్రపూర్ జిల్లాలోని తన నివాసంలో ఆత్యహత్యకు పాల్పడ్డారు. విషం ఇంజక్షన్ తీసుకోవడం ద్వారా ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.

Maharashtra : Sheetal Amte, social worker and granddaughter of Baba Amte, commits suicide - bsb
Author
Hyderabad, First Published Nov 30, 2020, 4:50 PM IST

ప్రముఖ సామాజిక కార్యకర్త బాబా అమ్టే మనవరాలు షీతల్ ఆమ్టే ఆత్మహత్య చేసుకున్నారు. బాబా ఆమ్టే కొడుకు డాక్టర్ వికాస్ ఆమ్టే కూతురు షీతల్ ఆమ్టే కరాజ్గి. సోమవారం ఆమె చంద్రపూర్ జిల్లాలోని తన నివాసంలో ఆత్యహత్యకు పాల్పడ్డారు. విషం ఇంజక్షన్ తీసుకోవడం ద్వారా ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.

మానసిక ఒత్తిడి వల్లే షీతల్ ఆత్మహత్య చేసుకుందని ప్రాథమిక సమాచారం. గత కొంత కాలంగా ఆమె మానసిక ఒత్తిడిలో ఉందని అంటున్నారు. అయితే మహారోగి సేవా సమితిలో జరిగిన అవకతవకలపై ఫేస్‌బుక్‌ లో ఆరోపణలు చేసిన తరువాత ఆమె చనిపోవడం పలు అనుమానాలను తావిస్తోంది.

డాక్టర్ అయిన  షీతల్‌ స్వచ్ఛంద సంస్థ మహారోగి సేవా సమితి సీఈవో, బోర్డు సభ్యురాలు కూడా. షీతల్ డిజేబిలిటీ స్పెషలిస్ట్‌ . ముఖ్యంగా కుష్టు వ్యాధి, అంగవైకల్యంతో బాధపడేవారికి సహాయం చేసేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థలో ఆమె కీలక వ్యక్తిగా పనిచేస్తున్నారు. 

అయితే గతవారం ఎంఎస్‌ఎస్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫేస్‌బుక్‌లో తన గళాన్ని వినిపించారు షీతల్ ఆమ్టే. అయితే వాయిస్ పెట్టిన రెండు గంటల్లోనే దాన్ని తొలగించారు. ఈ సందర్బంగా ఆమె ఆమ్టే కుటుంబంతోపాటు, ఇతరులపై కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

అలాగే సోమవారం ఉదయం ‘యుద్ధమూ శాంతి’ గురించి ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేశారు. ఆ తరువాత కొన్ని గంటలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విషాదాన్ని నింపింది.  అయితే  సోషల్‌ మీడియాల్‌ షీతల్‌ తమపై చేసిన ఆరోపణలను ఆమ్టే కుటుంబం ఖండించింది. నవంబరు 24న జారీ చేసిన ప్రకటనలో  ఆమె తల్లిదండ్రులు డాక్టర్ వికాస్, డాక్టర్ భారతితో పాటు డాక్టర్ ప్రకాష్ ఆమ్టే, డాక్టర్ మందాకిని ఆమ్టే  ఈ మేరకు సంతకాలు చేశారు. వికాస్‌, ప్రకాష్‌ ఇద్దరూ బాబా ఆమ్టే కుమారులు.

షీతల్ ఎంబిబిఎస్ డిగ్రీతో పాటు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి మాస్టర్స్ కూడా పూర్తి చేశారు. డాక్టర్ విద్య పూర్తి చేసిన తరువాత ఆమె ఆనంద్‌వన్‌లో సేవ చేయాలని నిర్ణయించుకుని కుష్టురోగులు, వికలాంగులు, దృష్టి  వినికిడి లోపం, ఆదిమ గిరిజనులకు ఎనలేని సేవ చేశారు. ఈ క్రమంలో డిజేబిటిటీ స్పెషలిస్టుగా ఖ్యాతి గడించారు. 

ముఖ్యంగా  ఆనంద్‌వన్‌లో సౌర విద్యుత్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయడంలో, స్మార్ట్ విలేజ్‌గా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆమె చేసిన సేవకు గాను ఆమెను వరల్డ్ ఎకనామిక్ ఫోరం 'యంగ్ గ్లోబల్ లీడర్ 2016' గా ఎంపిక చేసింది, తరువాత  ప్రపంచ ఆర్థిక ఫోరం నిపుణుల నెట్‌వర్క్‌ సభ్యునిగా ఎంపికయ్యారు. వరల్డ్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్‌కు  సేవలందిస్తున్నారు.. అలాగే 2016లో  ఇంక్‌ ఫెలోషిప్  రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న ఘనత ఆమె సొంతం.
 

Follow Us:
Download App:
  • android
  • ios