ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన,  ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వశాఖల కోసం మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రభుత్వంలో కీలకమైన శాఖల కోసం మూడు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది.

ఈ అంగీకారం కోసం   శివసేనకు హోంశాఖ,  ఎన్సీపీకి ఫైనాన్స్, కాంగ్రెస్ పార్టీకి రెవిన్యూ శాఖను తీసుకొంది. 

ఈ అంగీకారం కోసం   శివసేనకు హోంశాఖ,  ఎన్సీపీకి ఫైనాన్స్, కాంగ్రెస్ పార్టీకి రెవిన్యూ శాఖను తీసుకొంది. ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖ, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలను కూడ తీసుకొంది. ఎన్సీపీకి ఫైనాన్స్ తో పాటు హౌజింగ్ శాఖకు కూడ దక్కింది. కాంగ్రెస్ పార్టీకి రెవిన్యూ శాఖను ఇచ్చారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు కలిసి పోటీచేశాయి. అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకొన్న పార్టీగా బీజేపీ నిలిచింది.అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యాబలం మాత్రం బీజేపీకి దక్కలేదు.

శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించలేదు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నర ఏళ్లపాటు పంచుకొనేందుకు ఈ రెండు పార్టీల మధ్య అంగీకారం కుదరలేదు. 
Also read:ఫడ్నవీస్, అజిత్ ముచ్చట్లు : రాజకీయాలు కాకుండా.. వాతావరణం గురించి చర్చించారట

దీంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  గత నెల 28వ తేదీన శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర సీఎంగా  ఉద్దవ్ ఠాక్రే ప్రమాణం చేశారు.  

ఉద్దవ్ ఠాక్రే ప్రమాణం చేసిన తర్వాత ఈ మూడు పార్టీల మధ్య మంత్రిత్వ శాఖల పంపకం విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.మూడు పార్టీల మధ్య మంత్రి పదవుల పంపకం కోసం ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయమై గురువారం నాడు ఏకాభిప్రాయం కుదిరింది.