MaharashtraPolitics: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరగబోతుంది. శివసేన పార్లమెంటరీ పార్టీ విడిపోయే అవకాశం ఉందని, ఆ పార్టీకి చెందిన 19 మంది ఎంపీల్లో కనీసం డజను మంది లోక్‌సభలో ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని డిమాండ్ చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.
Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి గందరగోళం నెలకొంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గంతో శివసేన నాయకులు భేటీ కావడం చర్చనీయంగా మారింది. ఉద్ధవ్ ఠాక్రే త్వరలో తన ఎంపీలను కూడా కోల్పోబోతున్నరనే చర్చ ప్రారంభమైంది. ఇప్పటికే డజను(12) మంది శివసేన ఎంపీలు సీఎం ఏక్‌నాథ్ షిండేతో టచ్‌లో ఉన్నారని, వారు లోక్‌సభలో ప్రత్యేక గ్రూపుగా ఏర్పడవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో మహారాష్ట్ర కేబినెట్ గురించి బీజేపీ అధినాయకత్వంతో చర్చించేందుకు సీఎం ఏక్‌నాథ్ షిండే ఢిల్లీకి వెళ్లడం. ఇదిలా ఉంటే.. శివసేనకు చెందిన 12 మంది ఎంపీలకు ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించడం గమనార్హం. ఈ ఎంపీలంతా షిండే వర్గానికి మద్దతు తెలుపుతున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ శివసేన ఎంపీలు.. సీఎం ఏకనాథ్ షిండేతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి.. షిండేకు తన మద్దతు ప్రకటించే అవకాశముంది. ఈ పరిణామంతో శివసేన శాసనసభా పక్షం చీలిక తర్వాత.. ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ కూడా చీలిక బాటలో పయనిస్తున్నట్లు మహారాష్ట్ర పొలిటికల్ కారిడార్‌లో టాక్ వినిపిస్తుంది.
ఏక్‌నాథ్ షిండేకు మద్దతుగా శివసేనకు చెందిన రెబల్ ఎంపీలు నేడు లోక్‌సభ స్పీకర్ ఎదుట ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేయవచ్చని సమాచారం. 15 మంది శివసేన ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలవవచ్చని, అలాగే ఏక్నాథ్ షిండే వారిని ప్రధాని నరేంద్ర మోదీని కలిసేలా చేయవచ్చని సమాచారం.
షిండేతో టచ్‌లో ఉన్న ఎంపీలు వీరే..
శివసేన రోగి శంభాజీరావు మానే, సదాశివ్ లోఖండే, హేమంత్ గాడ్సే, హేమంత్ పాటిల్, రాజేంద్ర గవిట్, సంజయ్ మాండ్లిక్, శ్రీకాంత్ షిండే, శ్రీరంగ్ బర్నే, రాహుల్ షెవాలే, ప్రతాప్రావ్ గణపత్రావ్ జాదవ్, కృపాల్ తుమానే, భావనా షిండే లు షిండేకు మద్దతు ఇవ్వనున్నారు.
ఉద్ధవ్ నుంచి శివసేనను లాక్కునే ప్రయత్నం !
మరో పరిణామంలో.. సోమవారం నాడు.. ముంబైలో శివసేన ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం సమావేశమైంది. ఆయనను శివసేన నాయకుడిగా ఎన్నుకోవాలని తీర్మానం ఆమోదించబడింది. తిరుగుబాటు సమయంలో ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతు ఇచ్చిన 14 మంది ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రతిపాదనకు తమ మద్దతు తెలిపారని వర్గాలు పేర్కొంటున్నాయి. శివసేన పార్టీ ఈ ప్రతిపాదనతో ఉద్ధవ్ ను అన్ని విధాలుగా పక్కకు తప్పుకున్నారు. తొలుత అధికారం లాక్కున్నారు. తర్వాత.. ఉద్ధవ్ ఠాక్రే నుండి పార్టీని లాక్కునే ప్రయత్నం జరుగుతుందని విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఈ నేపథ్యం షిండే వర్గానికి మద్దతు తెలిపిన 12 మంది శివసేన రెబల్ ఎంపీలకు కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పించింది. వారు నిన్న లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. గత రాత్రి నుంచి ఈ రక్షణ కల్పించారు. అంతకుముందు.. ఈ 12 మంది ఎంపీలు రాహుల్ షెవాలేను నాయకుడిగా గుర్తించాలని నిన్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అయితే ఆయన లేఖపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
12 మంది ఎంపీల అభిప్రాయం ప్రకారం.. ఉద్దవ్ స్థానంలో రాజన్ విచారేను చీఫ్‌విప్‌గా చేయాలనే నిర్ణయించారు.ఎన్నికల కమిషన్‌లో శివసేన ఎన్నికల గుర్తు బాణం కమాండ్‌పై క్లెయిమ్ చేయడంపై స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే తదుపరి చర్య తీసుకుంటామని తిరుగుబాటు వర్గం పేర్కొంది.
