Asianet News TeluguAsianet News Telugu

Maharashtra political crisis : ‘వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నాం’ - బీజేపీ నాయకుడు సుధీర్ ముంగంటివార్

మహారాష్ట్రలో రోజు రోజుకు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఈ పరిణామాలన్నింటిని బీజేపీ నిశితంగా పరిశీలిస్తుందని ఆ పార్టీ నేత సుధీర్ ముంగంటివార్ అన్నారు. వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. 

Maharashtra political crisis: We are in wait and watch mode - BJP leader Sudhir Mungantiwar
Author
Mumbai, First Published Jun 28, 2022, 2:11 PM IST

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను బీజేపీ గమనిస్తోందని, వెయిట్ అంట్ వాచ్ మోడ్ లో ప్రస్తుతం తమ పార్టీ ఉందని ఆ పార్టీ నాయకుడు సుధీర్ ముంగంటివార్ అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు మ‌హారాష్ట్ర రాజకీయం విష‌యంలో రాబోయే రోజుల్లో త‌మ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందని పునరుద్ఘాటించారు. ‘‘ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో మరో కోర్ టీమ్ మీటింగ్ నిర్వహిస్తామని మేము నిన్న కూడా స్పష్టం చేశాం. మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము. ప్రస్తుతం మేము వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నాము ’’ అని ఆయన వార్తా సంస్థ ఏఎన్‌ఐ అన్నారు. 

power crisis: పెగుతున్న బొగ్గు ధ‌ర‌లు.. భార‌త్ విద్యుత్ ఉత్ప‌త్తిపై ఒత్తిడి !

ప్రస్తుతానికి బీజేపీ మెజారిటీని నిరూపించుకోవాల్సిన అవసరం సుధీర్ ముంగంటివార్ అన్నారు. తమకు నంబర్లు లేవని ఎంవీఏ ప్రభుత్వం ప్రకటించే వరకు వేచి చూస్తున్నామని చెప్పారు. మరోవైపు మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం అస్థిరంగా ఉన్నాయని మరో బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ అన్నారు. అధికార ఎంవీఏపై విరుచుకుపడ్డారు. ‘‘ ఎంవీఏ ప్రభుత్వం మైనారిటీలో ఉంది. వారు ప్రతిరోజూ   200-300 ప్రభుత్వ తీర్మానాలు (జీఆర్ లు) జారీ చేస్తున్నారు. ఇది ప్రజాధనం. దీనిపై రాష్ట్ర గవర్నర్ ను వివరణ కోరాను. దీనిపై విచారణ జరపాలని పేర్కొన్నాను ’’ అని అన్నారు.

Viral Video:వధువు పాదాలను తాకిన వరుడు.. నెటిజన్ల మనసు దోచేస్తున్న వీడియో..!

కాగా సోమవారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ జూన్ 22-25 మధ్య జారీ చేసిన ఉత్తర్వుల వివరాలను కోరుతూ మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వానికి లేఖ రాశారు. జూన్ 22-24 వరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని జీఆర్‌లు, సర్క్యులర్‌లపై పూర్తి సమాచారం అందించాలని గవర్నర్ కోష్యారీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరినట్లు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 ప్రకారం తన ముందు ఉంచడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుల్లో తీసుకున్న జీఆర్ లు, సర్క్యులర్లు, చర్చలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి పూర్తి నేపథ్య సమాచారం కావాలని గవర్నర్ కోరినట్లు లేఖలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే రెబ‌ల్ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. గౌహతిలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యేలందరికీ మా తలుపులు తెరిచి ఉన్నాయి. సోమవారం రాత్రి మీడియా ఆయ‌న ప్రతినిధులతో మాట్లాడుతూ.. గౌహతి ఉన్న రెబ‌ల్స్ రెండు వర్గాలుగా విడిపోయార‌ని ఆయన్నారు. త‌న‌తో15-16 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నార‌ని తెలిపారు. మనల్ని ఎదుర్కొనే ధైర్యం, నైతికత వారికి అస్సలు లేవని అన్నారు.ఈ క్ర‌మంలో షిండే వర్గానికి చెందిన రెబ‌ల్ ఎమ్మెల్యేలకు ఆయ‌న సవాల్ విసిరారు. రెబల్స్‌కు నిజంగా దమ్ముంటే.. రాజీనామా చేసి త‌మ‌ ముందు నిలబడాలని సూచించారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల వెనుక ఎవరున్నారో అంటూ బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను టార్గెట్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios