Maharashtra political crisis: మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేపై మాజీ సీఎం ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన పార్టీ పగ్గాలిస్తే.. తనకు వెన్నుపోటు పొడిచారని, మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని పడగొట్టారని ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Maharashtra political crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడింది. సేన రెబల్స్ తిరుగుబాటు తర్వాత.. బీజేపీ మద్దతుతో ఏక్ నాథ్ షిండే అధికారాన్నిచేపట్టారు.అయినా.. శివసేన మాత్రం నైతిక విజయం తామే సాధించమనీ, ఇప్పడికిప్పుడూ ఎన్నికలు నిర్వహించినా.. తాము 100 సీట్లు గెలుస్తామని ఆసక్తికర ప్రకటన చేస్తున్నారు శివసేన నాయకులు.
ఈ క్రమంలో మాజీ సీఎం ఉద్దవ్ తన నోరు విప్పాడు. శివసేన పార్టీ బాధ్యతలను షిండే కు అప్పగిస్తే.. తనని వెన్నుపోటు పొడిచారనీ, మహావికాస్ అఘాడి ప్రభుత్వాన్ని కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా.. ఇప్పటికీ ఎన్‌సిపి, కాంగ్రెస్ లు శివసేన వెంట నిలిచాయనీ, సేన కార్యకర్తల వల్ల గెలిచి అన్నీ పొందిన వారు (ఎమ్మెల్యేలు, మంత్రులు) తనను విడిచిపెట్టడం బాధాకరమని ఠాక్రే అన్నారు.
గత నెలలో.. MVA ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏక్‌నాథ్ షిండే సారధ్యంలో శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఫలితంగా మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ మైనారిటీలో పడింది. ఈ క్రమంలో గవర్నర్ బీఎస్ కోషియారీ బల పరీక్ష నిర్వహించాలని ఆదేశించడంతో ముందుగానే ఉద్ధవ్ ఠాక్రే.. సీఎంగా రాజీనామా చేశారు. తదుపరి శివసేన రెబల్ లీడర్ ఏక్‌నాథ్ షిండే సీఎంగా, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ క్రమంలో మహారాష్ట్రలోని కొత్త ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం సోమవారం జరిగిన ఫ్లోర్ టెస్ట్‌లో 164-99 తేడాతో విజయం సాధించింది, తన ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు శివసేన నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. షిండేకు అనుకూలంగా 164 ఓట్లు పోల్ కాగా, కొత్తగా ఏర్పాటైన బీజేపీ-షిండే క్యాంపు కూటమికి వ్యతిరేకంగా 99 ఓట్లు పోలయ్యాయి.
అంతకు ముందు రోజు బీజేపీకి చెందిన రాహుల్ నార్వేకర్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. నార్వేకర్ శివసేన శాసనసభా పక్ష నేతగా షిండేను తిరిగి నియమించారు. శివసేన చీఫ్ విప్‌గా గోగావాలే నియామించారు. రాష్ట్ర అసెంబ్లీలో మహారాష్ట్ర ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన తర్వాత.. విప్ ఉల్లంఘించినందుకు ఉద్ధవ్ ఠాక్రే శిబిరానికి చెందిన పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని కోరుతూ ఏక్నాథ్ షిండే వర్గం వ్యతిరేకంగా సోమవారం అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు వినతిపత్రం ఇచ్చింది. 16 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు స్పీకర్ కార్యాలయం ధృవీకరించింది. ఫ్లోర్ టెస్ట్ కోసం విధానసభకు హాజరు కావాలని గొగావాలే పార్టీ ఎమ్మెల్యేలకు విప్ కూడా జారీ చేశారు.
