Asianet News TeluguAsianet News Telugu

Maharashtra Political Crisis: తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఆదిత్య ఠాక్రే ఓపెన్ స‌వాల్.. ఏమ‌న్నారంటే..?

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొన‌సాగుతూనే ఉంది. ఈ క్రమంలో మంత్రి ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. గౌహతిలోని రెబ‌ల్ కూట‌మి రెండు గ్రూపులుగా విడిపోయార‌నీ,  త‌న‌తో 15-16 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నార‌ని తెలిపారు.
 

Maharashtra Political Crisis Aaditya Thackeray says rebel MLAs have sold themselves
Author
Hyderabad, First Published Jun 28, 2022, 3:26 AM IST

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొన‌సాగుతూనే ఉంది. సోమ‌వారం నాడు జ‌రిగిన ప‌రిణామాల‌తో మ‌హా రాజకీయం మ‌రింత ఉత్కంఠ‌భ‌రితంగా మారింది. ఓ వైపు..  శివసేన నేతృత్వంలోని సంకీర్ణ కూటమి మహా వికాస్ అగాడీ అసెంబ్లీలో మెజార్టీ కోల్పోగా.. మ‌రో వైపు తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. ఇదే త‌రుణంలో మహారాష్ట్రలో అధికారం తమదేంటూ బీజేపీ నాయకులు చెబుతున్నారు. కేవ‌లం ఈ రెండు,మూడు రోజులు మాత్రమే ప్రతిపక్ష హోదాలో ఉండబోతున్నట్లు బీజేపీ నేత‌లు పేర్కొంటున్నారు. మ‌రోవైపు రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు లేక‌పోలేద‌నే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే రెబ‌ల్ ఎమ్మెల్యేపై విరుచుక ప‌డ్డారు. గౌహతిలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యేలందరికీ మా తలుపులు తెరిచి ఉన్నాయి. సోమవారం రాత్రి మీడియా ఆయ‌న ప్రతినిధులతో మాట్లాడుతూ.. గౌహతి ఉన్న రెబ‌ల్స్ రెండు వర్గాలుగా విడిపోయార‌ని ఆయన్నారు. త‌న‌తో15-16 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నార‌ని తెలిపారు. మనల్ని ఎదుర్కొనే ధైర్యం, నైతికత వారికి అస్సలు లేవని అన్నారు.ఈ క్ర‌మంలో షిండే వర్గానికి చెందిన రెబ‌ల్ ఎమ్మెల్యేలకు ఆయ‌న సవాల్ విసిరారు. రెబల్స్‌కు నిజంగా దమ్ముంటే.. రాజీనామా చేసి త‌మ‌ ముందు నిలబడాలని సూచించారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల వెనుక ఎవరున్నారో అంటూ బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను టార్గెట్ చేశారు ఆదిత్య ఠాక్రే .  

 రెబల్ ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేశారని ఆరోపిస్తూ.. శివసేనలో దుమ్ము పోయింది” అని అన్నారు. అస్సాం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో వరదల‌తో స‌త‌మ‌త‌ప‌డుతుంటే.. తిరుగుబాటుదారులు మాత్రం గౌహతిలో ఎంజాయ్ చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిరుగుబాటు గ్రూపు నాయకుడు ఏక్‌నాథ్ షిండేకు మేలో ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారని, అయితే అతను డ్రామా చేశాడని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  

కాంగ్రెస్, ఎన్‌సిపిలు సేన‌కు ద్రోహం చేస్తాయని చాలా మంది చెప్పారు. కానీ, నేడు స్వంత నేత‌లే పార్టీకి న‌మ్మ‌క‌ ద్రోహం చేశారని మండిప‌డ్డారు.  పార్టీ రెబల్స్ చర్యపై పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల ఆహార బిల్లు రోజుకు ₹ 9 లక్షల వరకు ఉందని, వారు ప్రైవేట్ ఛాపర్లను తీసుకుంటున్నారని ఆదిత్య థాకరే పేర్కొన్నారు.
  
రెబల్ ఎమ్మెల్యే యామినీ జాదవ్ భర్త అయిన పార్టీ కార్పొరేటర్ యశ్వంత్ జాదవ్‌పై ఈ ఏడాది ప్రారంభంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలను ప్రస్తావిస్తూ, ఆదాయపు పన్ను శాఖ చర్యను తాము నిరసించామని ఆదిత్య థాకరే అన్నారు, అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు తనకు కన్నీళ్లు తెప్పించాయని అన్నారు..
 
ఇదిలా ఉంటే.. రెబ‌ల్ షిండే శిబిరంలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని వార్త‌లొస్తున్నాయి. అయితే.. షిండేతోపాటు 15 మంది ఎమ్మెల్యేల‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టం కింద అన‌ర్హ‌త వేటు వేయాల‌ని డిప్యూటీ స్పీక‌ర్ కు శివ‌సేన అధ్య‌క్షుడు ఉద్ధ‌వ్ ఠాక్రే వ‌ర్గం పిర్యాదుచేసింది.  సోమ‌వారం సాయంత్రం 5.30 గంట‌ల్లోపు త‌న ముందు హాజ‌రు కావాల‌ని డిప్యూటీ స్పీక‌ర్.. సంబంధిత ఎమ్మెల్యేల‌కు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల‌పై  షిండే రెబ‌ల్ కూట‌మి సుప్రీంకోర్టుని ఆశ్ర‌యించింది. ఈ అంశంపై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం, ఆ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను జూలై 12కు వాయిదా వేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios