Asianet News TeluguAsianet News Telugu

maharashtra crisis: దాడులు దారగొచ్చు, అప్రమత్తంగా వుండండి.. మహారాష్ట్ర అంతటా హైఅలర్ట్

శివసేన కార్యకర్తలు దాడులు చేసే అవకాశం వున్నందున మహారాష్ట్ర పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. శివసైనికులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చే అవకాశం వుందని.. అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వం అన్ని పోలీస్ స్టేషన్లను హెచ్చరించింది. 

Maharashtra Police On High Alert amid Shiv Sena Workers attack
Author
Mumbai, First Published Jun 24, 2022, 8:28 PM IST

మహారాష్ట్రలో రాజకీయాలు (maharashtra crisis) వేగంగా మారిపోతున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల వెంట క్యాడర్ వెళ్లిపోకుండా శివసేన అధినేత, సీఎం ఉద్ధవ్ థాక్రే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. మరోవైపు మహారాష్ట్రలోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. శివసేన సైనికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చే అవకాశం వున్నందున పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వుండాలని సూచించింది. మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేల కార్యాలయాలపై శివసైనికులు దాడులకు పాల్పడుతున్నారు. రెబల్ ఎమ్మెల్యే పోస్టర్లు, బ్యానర్లను తీసి వేసి వారికి వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 

అంతకుముందు Shiv Sena, థాక్రే పేర్లను ఉపయోగించకుండా మీరు ఎంత దూరం వెళ్లగరని మహారాష్ట్ర సీఎం Uddhav Thackeray తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శుక్రవారం శివసేన జిల్లా శాఖల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ఆయన మాట్లాడారు. పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన Rebel ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. తనను విడిచిపెట్టిన వారిని తాను ఎందుకు పట్టించుకోవాలని ఉద్ధవ్ ప్రశ్నించారు. శివసేనను విడిచిపెట్టడం కంటే ముందే చనిపోతామని ప్రకటించిన వారు ఇవాళ పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. 

Also Read:నా కొడుకుతో ఎందుకు సమస్య: ఏక్‌నాథ్ షిండేపై ఉద్ధవ్ ఠాక్రే

ఏక్‌నాథ్ షిండే తన స్వంత కొడుకును MP గా చేసుకొన్నాడని.. నా కొడుకుతో ఎందుకు సమస్య అని ఠాక్రే ప్రశ్నించినట్లు సమాచారం. నా శరీరం, నా తల, మెడ నుండి పాదాల వరకు నొప్పిగా ఉందని.. తాను కోలుకోలేనని అనుకున్నారని, కానీ అవేవీ తాను పట్టించుకోలేదని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. తనకు అధికారంపై అత్యాశ లేదని.. వర్షంలోనే సీఎం నివాసం నుండి మాతోశ్రీకి బయలుదేరానని ఆయన గుర్తుచేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అత్యాశతో పక్కకు లాక్కున్నారని ఉద్దవ్ ఠాక్రే ఆరోపించారు. 

కాగా.. సీఎం ఉద్ధవ్ థాక్రే అతని తనయుడు Aditya Thackeray కు వ్యతిరేకంగా Eknath Shinde  40 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టారు. ఏక్ నాథ్ షిండే తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలతో గౌహాతిలోని ఓ హోటల్ లో బస చేస్తున్నారు. ఆదిత్య థాక్రే ఇతర మంత్రుల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని కూడా ఆరోపణలున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios