" నేను తల్లినే కాదు.. ప్రజాప్రతినిధిని కూడా.." : అసెంబ్లీ సమావేశాలకు పసిబిడ్డతో వచ్చిన మహారాష్ట్ర ఎమ్మెల్యే..
మహారాష్ట్ర అసెంబ్లీలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నాగ్ పూర్ కు చెందిన మహిళా ఎమ్మెల్యే సరోజ్ అహిరే తన రెండున్నర నెలల పాపతో కలిసి శీతాకాల సమావేశానికి హాజరయ్యారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో అరుదైన ఘటన జరిగింది. ఓ మహిళా ఎమ్మెల్యే తన రెండున్నర నెలల పసిబిడ్డను తీసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది. బాలింత అయినా తన బాధ్యత విసర్మించకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడంతో ఆ మహిళ ఎమ్మెల్యేపై ప్రశంసలు వర్షం జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎమ్మెల్యే ఎవరని అనుకుంటున్నారా ? ఆమెనే నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ(ఎన్సీపీ)నాయకురాలు, నాసిక్ జిల్లాలోని డియోలాలి నియోజకవర్గం ఎమ్మెల్యే సరోజ్ అహిరే.
సెప్టెంబర్ 30న ఎమ్మెల్యే సరోజ్ అహిరే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే.. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దీంతో ఆమె తన రెండున్న నెలల పసిబిడ్డను తీసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది. కరోనా కారణంగా గత రెండున్నరేళ్లుగా అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదని ఆమె చెప్పారు. తాను తల్లినే అయినా.. ఓటర్లకు ఏం సమాధానం చెప్పాలని, కష్టమైనా అసెంబ్లీ సమావేశాలకు వచ్చానని అన్నారు. మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19న నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సరోజ తాను రెండున్నర నెలల చిన్నారితో అసెంబ్లీకి రావడంతో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
గతంలో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సరితా సింగ్ తన కుమారుడు అద్వైత్‌తో పాటు వెళ్లేంది. ఆమె సభలో మాట్లాడుతుండగా.. ఆమె కుమారుడిని ఇతర ఎమ్మెల్యేలు హ్యాండిల్ చేసేవారు. ప్రభుత్వోద్యోగులమైతే ప్రసూతి సెలవులు తీసుకునే హక్కు లేదని రోహతాస్ నగర్ ఎమ్మెల్యే సరిత అన్నారు. అలాగే..గతంలో 2013లో సీపీఐ ఎమ్మెల్యే చంద్రకళ కూడా ఇలానే చేసింది. 2013 డిసెంబరు 18న హైదరాబాద్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆమె తన నవజాత శిశువుతో కలిసి సమావేశాలకు హాజరైంది. అందరి ప్రసంశలు అందుకుంది.