మావోయిస్టులు మహారాష్ట్ర మంత్రినే లక్ష్యంగా చేసుకొన్నారు. మంత్రికి బెదిరింపు లేఖను పంపారు. తమ క్యాడర్ ను పొట్టన బెట్టుకొన్నందుకు చంపేస్తామని లేఖను పంపారు.
ముంబై: మహారాష్ట్ర మంత్రిని లక్ష్యంగా చేసుకొని Maoist బెదిరింపు letterను పంపారు. మావోయిస్టు పార్టీకి చెందిన క్యాడర్ ను లక్ష్యంగా చేసుకొని చంపినందుకు గాను మంత్రికి మావోయిస్టులు బెదిరింపు లేఖలు పంపారు.
రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులను మట్టుబెట్టినందుకు మావోయిస్టుల పేరుతో మహారాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి Eknath Shinde కు మావోయిస్టులు బెదిరింపు లేఖలను పంపారు. ఈ లేఖతో మంత్రి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంత్రి నివాసం వద్ద బద్రతను పెంచారు. ఈ లేఖకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఈ లేఖపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంతకు ముందు కూడా తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని మంత్రి ఏక్‌నాథ్ షిండే మీడియాకు తెలిపారు. గడ్చిరోలికి మంత్రిగా ఉన్న తాను అక్కడున్న ప్రజలను కాపాడటమే కాకుండా జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులతో పోరాడాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒక్కటే మార్గం షిండే సూచించారు. ఇదిలా ఉండగా గతేడాది నవంబర్‌లో గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల టాప్ కమాండర్‌తో సహా 26 మంది నక్సల్స్ హతమయ్యారు.
