Maharashtra Cops: లౌడ్ స్పీకర్ల వివాదం మరింతగా ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర పోలీసులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి శాంతిభద్రతల పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర పోలీసు చీఫ్ హెచ్చరించారు.
loudspeaker issue: లౌడ్ స్పీకర్ల వివాదం మరింతగా ముదురుతోంది. మే 3 తర్వాత ఎలాంటి ఘటనలు జరిగినా తన బాధ్యత ఉండదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే హెచ్చరించారు. మసీదులపై లౌడ్ స్పీకర్లు, మైకుల తొలగింపునకు సంబంధించి ఆయన ఇచ్చిన గడువును మరోసారి గుర్తుచేస్తూ.. ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర పోలీసులు లౌడ్ స్పీకర్ల వివాదంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి శాంతిభద్రతల పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర పోలీసు చీఫ్ హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసులకు సెలవులు కూడా రద్దు చేసినట్టు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే రాజేసిన లౌడ్ స్పీకర్లు, మైకుల వివాదం మరింతగా ముదురుతోంది. మసీదులపై మైకులను తొలగించాలనే దానిపై చాలా రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. రాజ్ థాక్రే పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. ఆదివారం ఔరంగాబాద్‌లో భారీ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు. మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించడానికి మే 3 డెడ్‌లైన్‌కు కట్టుబడి ఉన్నామని, అలా చేయకపోతే హిందువులందరూ ఆ మత స్థలాల వెలుపల హనుమాన్ చాలీసా ప్లే చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లు, మైకుల తొలగింపునకు మే 3 డెడ్‌లైన్ తర్వాత ఎలాంటి ఘటనలు జరిగినా తనది బాధ్యత కాదని అన్నారు. మహారాష్ట్ర సర్కారుపై తీవ్ర స్థాయిలో మరోసారి విమర్శలు గుప్పించారు. ఒక వేళ ప్రభుత్వం ఈ విషయాన్ని మత సమస్యగా మార్చాలనుకుంటే ఎంఎన్ఎస్ దానికి తగిన రీతిలో సమాధానం ఇస్తుందంటూ హెచ్చరించారు. లౌడ్ స్పీకర్ల సమస్య సామాజిక సమస్య అని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారినై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలను పరిరక్షించడానికి మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా ఉన్నారనీ, శాంతికి విఘాతం కలిగించే చర్యలను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర డీజీపీ రజనీష్ సేథ్ వెల్లడించారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ థాక్రే ఇటీవల చేస్తున్న ప్రసంగాల్లో మసీదులపై లౌడ్‌స్పీకర్‌లను తొలగించాలని హెచ్చరికల నేపథ్యంలో డీజీపీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలిస్తున్నామనీ, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము సేథ్ స్పష్టం చేశారు. ఎలాంటి శాంతిభద్రతల పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
మహారాష్ట్ర పోలీసులు ఎలాంటి శాంతిభద్రతల పరిస్థితినైనా నిర్వహించగలుగుతారు. అన్ని పోలీసు సెలవులు రద్దు చేయబడ్డాయి. 87 కంపెనీల స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( SRPF) మరియు రాష్ట్రవ్యాప్తంగా 30,000 మంది హోంగార్డులను మోహరించామని సేథ్ తెలిపారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలను కాపాడాలని ప్రతి ఒక్కరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. MNS చీఫ్ ప్రసంగాన్ని పరిశీలిస్తున్నామనీ, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. "ఔరంగాబాద్ సీపీ ప్రసంగాన్ని పరిశీలిస్తున్నారు. అతను అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాడు" అని సేథ్ మీడియాతో అన్నారు.
