ప్రియురాలిపై ఉన్మాది కత్తితో దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది. గత కొంత కాలంగా ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఆగ్రహానికి గురైన ఆ యువకుడు ఆమె మీద కత్తితో దాడిచేశాడు.
ఇటీవల ప్రేమపేరుతో యువతులను వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు తీవ్రమవుతున్నాయి. ప్రేమిస్తున్నామని వెంటపడడం.., కాదంటే దారుణాలకు తెగబడటం మామూలయ్యాయి. తాజాగా ఓ వన్ సైడ్ లవర్ తనకు నచ్చిన యువతిపై లవ్ యూ అంటూ వెంటబడ్డాడు. ఆమెకు దగ్గరవుదామని ప్రయత్నించాడు. కానీ, ఆ యువతి అతని ప్రయత్నాలు తిప్పికొట్టింది. అతని ప్రేమకు నిరాకరించింది. నువ్వంటే.. ఇష్టలేదని తెగేసి చెప్పింది. అయినా ఆ యువకుడు పిచ్చోడిలా ఆ యువతి వెనకాల నీడలా తిరిగాడు.
అయినా ఆ యువతి మనస్సు కరగలేదు. దీంతో సహనం కోల్పోయిన ఆ వన్ సైడ్ లవర్ తన ప్రియురాలిపై దారుణానికి తెగబడ్డాడు.యువతిపై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాధితురాలి ఆస్పత్రికి తరలించారు. ఆ నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం పూణెలోని సదాశివపేట ప్రాంతంలో చోటుచేసుకుంది. నిందితుడైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగమంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయింది. అందులో పదునైన కొడవలితో ఆ యువకుడు అమ్మాయిని వెంబడిస్తున్నాడు. నిందితుడిని శంతను లక్ష్మణ్ జాదవ్‌గా గుర్తించారు.
యువకుడు ముందుగా బాలిక స్కూటీని ఆపి, కొడవలి తీసి ఆమెపై దాడి చేయడం సీసీటీవీ వీడియోలో చూడవచ్చు. కత్తితో దాడి చేసిన వెంటనే ఆ యువతి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. అయినా ఆ నిందితుడు ఆ యువతిని వదల్లేదు. ఆమెను తరుముకుంటూ వచ్చి..వెనుక నుండి మళ్లీ దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ యువకుడిపై దాడి చేసి బాలికను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఆ యువకుడిని అదుపు చేసి పోలీసులకు అప్పగించారు.
నిందితులు బాధిత బాలికను నిత్యం వేధించేవాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు పలుమార్లు నిందితుడిని వివరించారు. ఈ విషయాన్ని యువతి కుటుంబ సభ్యులు యువకుడి తల్లిదండ్రులకు కూడా తెలియజేశారు. ఇంత జరిగినా నిందితుడు మాత్రం బాలికకు ఫోన్ చేస్తూ.. వేధింపులకు గురి చేసేవాడని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఆగ్రహించిన నిందితులు బాలికపై దాడికి పాల్పడ్డారు. ఈ మొత్తం ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం నిందితుడు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
