మహారాష్ట్ర గవర్నర్‌గా దిగిపోతా.. ప్రధాని మోడీకి కూడా చెప్పేశా: భగత్ సింగ్ కొశ్యారీ
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను అన్ని రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్టు తెలిపారు. గవర్నర్ పదవి నుంచి కూడా దిగిపోవాలని యోచిస్తున్నారని, ఈ విషయాన్ని ఇది వరకే ప్రధాని మోడీకి తెలిపానని వివరించారు.

ముంబయి: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. తాను గవర్నర్ పదవి నుంచి దిగిపోవాలని నిశ్చయించుకున్నట్టు తెలిపారు. రాజ్‌భవన్ నుంచి విడుదలైన ప్రకటనలో ఈ నిర్ణయాన్ని ఇది వరకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలియజేసినట్టు వివరించారు.
మహారాష్ట్ర ఎంతో మంది సంత్ సాధువులకు, సంఘ సంస్కర్తలకు, యోధులకు నిలయమైన భూమి అని, అలాంటి రాష్ట్రానికి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడం తనకు గౌరవదాయకం అని భగత్ సింగ్ కొశ్యారీ తెలిపారు. ‘ఈ మూడేళ్లలో తాను మహారాష్ట్ర ప్రజల నుంచి పొందిన ప్రేమ, ఆప్యాయతలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరవలేను. ఇటీవలే ప్రధానమంత్రి ముంబయి పర్యటనకు వచ్చినప్పుడు తాను అన్ని రాజకీయ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు చెప్పాను. తన మిగిలిన జీవితం చదవడం, రాయడం, ఇతరత్రాలకు కేటాయించాలని యోచిస్తున్నట్టు తెలిపాను’ అని వివరించారు.
Also Read: Chhatrapati Shivaji remarks row: గవర్నర్ కోష్యారీని తొలగించాలని మహారాష్ట్రలో నిరసనలు
ప్రధానమంత్రి నుంచి తాను ఎల్లప్పుడూ ప్రేమ, ఆప్యాయతలను పొందానని, ఈ సారి కూడా అదే విధమైన ప్రేమను పొందుతానని భావిస్తున్నట్టు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ పేర్కొన్నారు.