కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి, కేంద్ర మంత్రి హోం క్వారంటైన్..
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రికార్డు స్థాయి కేసులతో బెంబేలెత్తిస్తోంది. రోజురోజుకు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ మరింత ఆందోళన సృష్టిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర లో వేగంగా విస్తరిస్తూ అక్కడి ప్రజలను వణికిస్తోంది. తాజాగా బిజెపి మాజీ ఎమ్మెల్యే పాస్కల్ ధనారే (49) కరోనాతో కన్నుమూశారు.

ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ధనారే ఇటీవల కోవిడ్ 19 బారిన పడటంతో గుజరాత్, వాపిలోని ఆసుపత్రిలో చేరారని, అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదివారం రాత్రి ముంబైలోని ఆస్పత్రికి తరలించారని తెలిపారు. అయినా ఫలితం లేకపోవడంతో సోమవారం తెల్లవారుజామున ధనారే మరణించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
సుప్రీం కోర్టు స్టాఫ్ కి కరోనా పాజిటివ్.. ఇక న్యాయమూర్తులు సైతం ఇంటినుంచే.....
పాల్ఘర్ జిల్లా, దహనుకు చెందిన ఆయన 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ధనారేకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
రెండో దశలో కరుణ వ్యాప్తి కొనసాగుతున్న సమయంలో ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్ బాల్యన్‌కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లో పర్యటించినప్పుడు తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్గా నిర్ధారణ అయిందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను హోమ్ క్వారంటైన్ లో ఉన్నానన్నారు. అలాగే ఇటీవలి కాలంలో తనను సన్నిహితంగాఉన్న వారంతా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు పాటించాలని బాల్యన్ కోరారు.