మహారాష్ట్రలోని నాందేడ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోనారిఫాటా కరంజీ సమీపంలోని నాందేడ్-కిన్వాట్ జాతీయ రహదారిపై  టెంపోను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడిక్క‌డే మృతిచెంద‌గా.. మ‌రికొంద‌రి తీవ్ర గాయాలయ్యాయి.

మహారాష్ట్రలోని నాందేడ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్-కిన్వాట్ జాతీయ రహదారిపై సోనారిఫాటా కరంజీ సమీపంలో ఐచర్ టెంపోను సిమెంట్​ లోడ్​తో వెళ్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు మరణించారు. మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హిమాయత్‌నగర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ప్రాథమిక సమాచారం. హిమాయత్ ​నగర్​లోని కరంజిఫాటా వద్ద శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. 

 మృతులు, క్షతగాత్రులంతా బీహార్‌కు చెందిన వారనీ, రైల్వే పనుల నిమిత్తం బిహార్ నుంచి నాందేడ్ వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో వారు ఐషర్ టెంపో లో తన నివాసానికి తిరిగి వస్తున్నారు. ఈ స‌మ‌యంలో ఐషర్ టెంపోను సిమెంట్ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఐచర్‌ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి.డి. భుస్నూర్, అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహాజన్‌తో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించి, తీవ్రంగా గాయపడిన కార్మికులను చికిత్స కోసం ఆసుపత్రికి పంపినట్లు సమాచారం.