మహారాష్ట్రకు చెందిన ఓ దొంగ ప్రేమికుడి వరుస దొంగతనాలకు పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టారు. ముంబయిలోని ఓ బార్‌లో పని చేస్తున్న యువతితో ఈ యువకుడు ప్రేమలో పడ్డాడు. ఇప్పటికి సుమారు 50 లక్షలు ఆమె కోసం ఖర్చు పెట్టి ఉంటాడని పోలీసులు తెలిపారు.
ముంబయి: మహారాష్ట్ర థానే జిల్లాలో ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారు ఒక అలవాటుగా ఈ దొంగతనం చేస్తున్నారు. అందులో ఒకరు తన గర్ల్ ఫ్రెండ్ కోసం చోరీలు చేస్తున్నాడు. ముంబయిలోని ఓ బార్‌లో పని చేసే తన గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆ దొంగ సుమారు 41 చోరీలు చేశాడు. కనీసం 50 లక్షలు ఆమె కోసం ఖర్చు పెట్టాడు. వీరిద్దరూ పలు మార్లు దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లారు. బెయిల్ పై వచ్చి దొంగతనం చేసి మళ్లీ జైలుకు వెళ్లారు. ఈ తంతు తరుచూ కొనసాగుతుండటం బాధాకరం.
థానే జిల్లాలో డోంబివలీలోని మన్‌పడా పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు ప్రారంభించారు. 38 ఏళ్ల యూసుఫ్ షేక్, 28 ఏళ్ల నౌషద్ ఆలాం అలియాస్ సాగర్. వీరిద్దూ నవీ ముంబయిలో కలిసే ఉంటున్నారు.
యూసుఫ్‌కు ఈ దొంగతనం పై తప్పు ఆలోచన లేదు. ఇదంతా తాను ప్రేమ కోసం చేస్తున్నానని చెప్పాడు. తాను ఆమె ప్రేమలో పడ్డానని వివరంచారు. ఆ బార్ గర్ల్ కోసం యూసుఫ్ యూసుఫ్ ఇప్పటి వరకు సుమారు 50 లక్షలు ఖర్చు పెట్టాడని తెలిపారు.ః
పోలీసులు కూడా నిరసనకు అవకాశం ఇవ్వడం లేదు.
