Asianet News TeluguAsianet News Telugu

Omicron: మహారాష్ట్రలో ఒమిక్రాన్ అలజడి.. ఒకేసారి 7 కేసులు గుర్తింపు, దేశంలో 12కి చేరిన సంఖ్య

దేశంలో చాపకింద నీరులాగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో ఏడు కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒకేసారి 7 కేసులు వెలుగు చూడటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 13కి చేరింది. మహారాష్ట్రలో 8, కర్ణాటకలో 2, గుజరాత్‌లో 1, ఢిల్లీలో 1 కేసుల వెలుగుచూశాయి. 

Maharashtra detects 7 more cases of Omicron variant; Indias tally reaches 12
Author
Mumbai, First Published Dec 5, 2021, 7:08 PM IST

దేశంలో చాపకింద నీరులాగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో ఏడు కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒకేసారి 7 కేసులు వెలుగు చూడటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 13కి చేరింది. మహారాష్ట్రలో 8, కర్ణాటకలో 2, గుజరాత్‌లో 1, ఢిల్లీలో 1 కేసుల వెలుగుచూశాయి. 

కాగా.. ఆదివారం దేశ రాజధాని న్యూఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. Tanzania నుండి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ సోకిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి Satyendar Jain చెప్పారు. ఢిల్లీలోని LNJP hospital ఆసుపత్రిలో 17 మంది కరోనాతో చేరారని  ఆయన వివరించారు. ఆసుపత్రిలో చేరిన తొమ్మిది మందికి గొంతు నొప్పి, జ్వరంతో బాధపడున్నారు. వీరి నమూనాలను టెస్టింగ్ కోసం పంపినట్టుగా అధికారలు తెలిపారు. ఫలితాలు రావడానికి నాలుగైదు రోజుల సమయం పడుతుంది.

Also Read:Omicron Symptoms: ఇండియాలో ఐదుగురు ఒమిక్రాన్‌ పేషెంట్లలో ఉన్న లక్షణాలు ఇవే..

యూకే నుండి ముగ్గురు కొత్త రోగులు ఆసుపత్రుల్లో చేరారని లోక్‌నాయక్ జయప్రకాష్ ఆసుపత్రి సూపరింటెండ్త డాక్టర్ Suresh kumar చెప్పారు. Omicronకేసులు నమోదైన దేశాల నుండి సుమారు 15 మంది రోగులు ఢిల్లీలోని ఎన్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చేరారు.Delhiలో కరోనా పాజిటివ్ రేటు 0.08 శాతం పాజిటివ్ రేటుతో 51 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా కేసులు 14,41, 295కి చేరాయి. ఢిల్లీలో కరోనా 14.15 లక్షలకు చేరుకొన్నాయని  ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 

ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల నుండి  విమానాలను నిషేధించాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గుజరాత్ లో ఒకటి, కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. జింబాబ్వేకు వెళ్లిన 72 ఏళ్ల వ్యక్తికి గుజరాత్ లోని జామ్ నగర్ కు చెందిన వ్యక్తికి ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.  దక్షిణాఫ్రికా దేశాల్లో మొదటిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ తో గత వారం నమోదయ్యాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios