''వారి వ్యక్తిగతం.. అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీ మద్దతు లేదు..''
Ajit Pawar-NCP: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్, హసన్ ముషారఫ్, ఛగన్ భుజ్ బల్ సహా 29 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం రాజ్ భవన్ కు చేరుకుని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న అజిత్ పవార్ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
NCP chief Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే శివసేన చీలికకు కారణమైన ఏక్ నాథ్ షిండే.. బీజేపీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇన్ని రోజులు ప్రతపక్షంలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్.. హసన్ ముషారఫ్, ఛగన్ భుజ్ బల్ సహా 29 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం రాజ్ భవన్ కు చేరుకుని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న అజిత్ పవార్ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని పంచుకోనున్నారు. దీనిపై స్పందించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వ్యక్తిగతంగా వెళ్లారనీ, వారికి పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లేదని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి.
ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు చేసిన ప్రమాణ స్వీకారానికి పార్టీ అధికారిక మద్దతు లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధికార ప్రతినిధి మహేశ్ తపసే ఆదివారం తెలిపారు. ఎన్సీపీ పార్టీ కార్యకర్తలు, జిల్లా అధ్యక్షుడు, తాలూకా అధ్యక్షుడు, యువత, మహిళలు పార్టీ జాతీయ నాయకుడు శరద్ పవార్ వెంట ఉన్నారని తపసే ఒక వీడియో సందేశంలో తెలిపారు. ఆపరేషన్ లోటస్ లో భాగంగా మహారాష్ట్రలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందనీ, దీనికి ఎన్సీపీ అధికారిక మద్దతు లేదన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వారు ఇది వారి వ్యక్తిగత నిర్ణయమనీ, ఎన్సీపీది కాదని ఆయన అన్నారు. కాగా, 288 అసెంబ్లీ స్థానాలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. శివసేన (అప్పుడు అవిభాజ్య) కు వ్యతిరేకంగా షిండే నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసిన ఏడాది తర్వాత ఈ రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. 30 జూన్ 2022న షిండే సీఎంగా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.