Maharashtra Crisis: ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాపై బీజేపీ అమిత్ మాల్వియా, సేనకు చెందిన సంజయ్ రౌత్ తదితరులు స్పందించారు. గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి మహారాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన కొద్ది నిమిషాలకే.. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తు్న్న‌ట్టు థాకరే ప్రకటించారు. 

Maharashtra Crisis: మ‌హారాష్ట్ర సంక్షోభం కైమాక్స్ కు చేరింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆదేశించారు. ఆ ఆదేశాల‌పై స్టే ఇవ్వాల‌ని సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన ఉద్ద‌వ్ కు ఎదురుదెబ్బ త‌గిలింది. కోర్టు ఆదేశాలు వెలువ‌డిన కొద్ది నిమిషాలకే ఉద్ధవ్ థాకరే.. తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఫేస్ బుక్ లైవ్ లో ప్రకటించారు. అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి త‌న రాజీనామాను సమ‌ర్పించారు.

మీ నాయకత్వానికి ధన్యవాదాలు: ప్రియాంక చతుర్వేది 

సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే రాజీనామాపై శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఉద్ధవ్ నాయకత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆమె ట్విట్టర్‌లో ఇలా రాశారు. “ ఉద్ధవ్ జీ.. మీ నాయకత్వానికి ధన్యవాదాలు. మీరు నూత‌న కూటమికి నాయకత్వం వహించే కష్టమైన బాధ్య‌త‌ను నిర్వ‌హించారు. మహమ్మారి నుండి రాష్ట్రాన్నిబ‌య‌ట‌ప‌డివేయ‌డంలోసహాయపడ్డారు. రాష్ట్రంలో మత విద్వేషాలు చేలారేగ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఎలాంటి పక్షపాతం లేకుండా.. రాష్ట్ర ప్ర‌జలంద‌రికీ ప్రయోజనాలు చేకూర్చారు అని తెలిపారు.

Scroll to load tweet…

సున్నితమైన సీఎంను కోల్పోయాం: సంజయ్ రౌత్

సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే రాజీనామాపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్‌లో ఇలా రాసుకోచ్చారు. "ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చాలా మర్యాదపూర్వకంగా రాజీనామా చేశారు. మనం సున్నితమైన, మంచి ముఖ్యమంత్రిని కోల్పోయాము. మోసం అంతం కాదని, దానికి చరిత్ర సాక్షిగా నిలిస్తుంది. థాకరే గెలుస్తాడు. ఇది గొప్ప విజయానికి నాంది. శివసేన కోసం... లాఠీలు దెబ్బ‌లు తిన్నారు. జైలుకు వెళతారు, కానీ బాలాసాహెబ్ అది శివసేనను మండేలా చేస్తుంది!"అని పేర్కొన్నారు.

Scroll to load tweet…

దయ నుండి పతనం: బిజెపి అమిత్ మాల్వియా 

శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే అధికారంలో లేకపోయినా ప్రభుత్వాలను నియంత్రించగల వ్యక్తి. కానీ, అయ‌న కుమారుడు ఉద్ధవ్ థాకరే తన సొంత పార్టీని కూడా అదుపు చేయలేకపోయారు. త‌న పార్టీని నియంత్రించలేనప్పుడు.. మొత్తం ప్రభుత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తారు. దయ నుండి ఎంత పతనం! అని భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగం ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు.

Scroll to load tweet…