Asianet News TeluguAsianet News Telugu

భార్యతో విడిపోవాలని కేసు: బిడ్డను కనేందుకు కోర్టుకెక్కిన భార్య

విడాకులు కావాలని కోరిన భర్తతోనే  తనకు రెండో బిడ్డను కనేందుకు అనుమతి ఇవ్వాలని  ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. ఈ  నెల 24వ తేదీన మ్యారేజీ కౌన్సిలర్‌తో సమావేశం కావాలని దంపతులకు కోర్టు సూచించింది.

Maharashtra: Court lets woman have baby with estranged hubby
Author
Mumbai, First Published Jun 23, 2019, 4:19 PM IST

ముంబై: విడాకులు కావాలని కోరిన భర్తతోనే  తనకు రెండో బిడ్డను కనేందుకు అనుమతి ఇవ్వాలని  ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. ఈ  నెల 24వ తేదీన మ్యారేజీ కౌన్సిలర్‌తో సమావేశం కావాలని దంపతులకు కోర్టు సూచించింది.

35 ఏళ్ల వివాహిత విడాకులు కోరుతున్న భర్తతో రెండో  బిడ్డను కనాలని కోరుతోంది. 2017లో తన భార్య నుండి  విడాకులు కావాలని ముంబై కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది.అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో వివాహిత 2018లో వివాహిత నాందేడ్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనకు రెండో బిడ్డను కనేందుకు అనుమతి ఇవ్వాలని  కోరింది.

ఈ కేసు విషయమై విచారణ సాగింది. తమ దాంపత్య హక్కులను పునరుద్దరించడం ద్వారా కానీ, కృత్రిమ పద్దతిలో కానీ బిడ్డను కనేందుకు అనుమతి ఇవ్వాలని కుటుంబ న్యాయస్థానాన్ని కోరారు.

ఈ అభ్యర్థనను కుటుంబ న్యాయస్థానం పరిశీలించింది. సంతానోత్పత్తి హక్కులు భావోద్వేగపరంగా చర్చించదగినవి కోర్టు అభిప్రాయపడింది. స్త్రీ, పురుష సంక్షిష్టతతో కూడినవని, న్యాయపరమైన, సాంఘికపరమైన చిక్కులను సృష్టించగలవని జడ్జి పేర్కొన్నారు.

సంతానోత్పత్తి హక్కు మహిళకు ఉందని ఆ హక్కును ఆమె వినియోగించుకోవచ్చునని మాత్రమే చెప్పగలమన్నారు. ప్రస్తుత కేసులో మహిళ తన భర్తను కృత్రిమ గర్భాదానం కోసం వీర్యాన్ని దానం చేయాలని అభ్యర్థన సంతానోత్పత్తి కోసం ఆమె ఎంపిక చేసుకొన్న న్యాయమైన విధానమన్నారు.

ఈ విషయంలో ఈ జంట రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఎక్స్‌పర్ట్‌ను సంప్రదించాలని తెలిపారు. అయితే దీని కోసం భర్త సమ్మతి చాలా ముఖ్యమన్నారు. ఈ నెల 24న మ్యారేజీ కౌన్సిలర్‌తో సమావేశం కావాలన్నారు. ఓ నెలలోగా ఐవీఎఫ్ ఎక్స్‌ఫర్ట్‌ను సలహాను అడగాలని కోర్టు తెలిపింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios