మీ మద్ధతు కావాలి: ఫడ్నవీస్‌కు ఉద్ధవ్ ఫోన్.. మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం
మహారాష్ట్ర రాజకీయాల్లో కత్తులు దూస్తున్న శివసేన, బీజేపీ అగ్రనేతలు సీఎం ఉద్దవ్ థాక్రే, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ల మధ్య మాటలు కలిశాయి. అయితే ఇది రాజకీయాల కోసం కాదు సుమా.
మహారాష్ట్ర రాజకీయాల్లో కత్తులు దూస్తున్న శివసేన, బీజేపీ అగ్రనేతలు సీఎం ఉద్దవ్ థాక్రే, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ల మధ్య మాటలు కలిశాయి. అయితే ఇది రాజకీయాల కోసం కాదు సుమా.
వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి థాకరే ఆదివారం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించక తప్పని పరిస్థితులు తలెత్తాయని, ఇందుకు బీజేపీ మద్దతు కావాలని సీఎం కోరారు.
దీనిపై స్పందించిన ఫడ్నవీస్.. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా తప్పకుండా మద్దతిస్తామని హామీ ఇచ్చారు. ఇక, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరేకు కూడా సీఎం ఉద్ధవ్ ఫోన్ చేశారు.
కరోనా దృష్ట్యా ప్రభుత్వం తీసుకోబోయే కఠిన నిర్ణయాలకు మద్దతు కావాలని రాజ్‌థాకరేను ముఖ్యమంత్రి కోరారు. మరోవైపు కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో మంత్రి రాజేంద్ర షింగ్నే ఆదివారం ఆక్సిజన్ తయారీదారులతో సమావేశమయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉందని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సిలిండర్ల సంఖ్యను అందుబాటులోకి తేవాలని రాజేంద్ర విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.