Asianet News TeluguAsianet News Telugu

maharashtra crisis: విశ్వాస పరీక్షకు ముందు కేబినెట్ భేటీ, సచివాలయానికి ఉద్ధవ్, ఏం జరుగుతోంది..?

రేపు విశ్వాస పరీక్ష నేపథ్యంలో మహారాష్ట్ర కేబినెట్ భేటీకి సీఎం ఉద్ధవ్ థాక్రే నిర్ణయించారు. మరోవైపు శివసేన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది . ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి.

Maharashtra Cabinet Meeting Begins
Author
Mumbai, First Published Jun 29, 2022, 5:41 PM IST

వారం రోజులుగా చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు (maharashtra crisis) దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం ఉద్ధవ్ థాక్రే (uddhav thackeray) చడం సంచలనం సృష్టించింది. అసెంబ్లీలో రేపు విశ్వాస పరీక్ష నేపథ్యంలో కేబినెట్ భేటీ (maharashtra cabinet) రేపుతోంది. దీనిలో భాగంగా మహారాష్ట్ర సచివాలయం వద్దకు సీఎం ఉద్ధవ్ థాక్రే చేరుకున్నారు. 

రేపు అసెంబ్లీ గవర్నర్ విశ్వాస పరీక్షకు ఆదేశించడంతో శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ఆదేశాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఉద్ధవ్ వర్గం. సుప్రీంకోర్టు విచారణ తర్వాతే రేపు బలపరీక్ష వుంటుందా లేదా అన్న దానిపై క్లారిటీ రానుంది. అసెంబ్లీలో థాక్రే సర్కార్ తమ మెజారిటీని నిరూపించుకోవాలని రేపు.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించారు గవర్నర్. గురువారం ఉదయం 11 గంటలకు ఈ విశ్వాస పరీక్ష జరగనుంది. 

ఈ ప్రక్రియను ఎట్టి పరిస్ధితుల్లోనూ సాయంత్రం 5 గంటల్లోగా పూర్తి చేయాలని గవర్నర్ ఆదేశించారు. నిన్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ ను కలిసిన తర్వాత ఈ ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు గౌహతిలో వున్న శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే గోవాకు బయల్దేరారు. శివసేన పార్టీలో 2/3 వంతు ఎమ్మెల్యేల మద్ధతు తనకు వుందని ఆయన అంటున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే సమయానికి గోవా నుంచి ముంబై వచ్చేలా షిండే వర్గం ప్లాన్ చేస్తోంది. 

ALso Read:Maharashtra political crisis: మహా సంక్షోభం.. ఫ్లోర్ టెస్ట్‌కు సిద్ధమే.. : ఏక్‌నాథ్ షిండే

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు గాను ప్రస్తుతం 287 మంది సభ్యులు వున్నారు. అధికార మహా వికాస్ అఘాడీ కూటమిలో ఇంతకుముందు శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్ కు 44 మంది సభ్యుల బలం వుంది. బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు వున్నారు. అయితే రెబల్ ఎమ్మెల్యే షిండే.. తన వెంట 38 మంది శివసేన ఎమ్మెల్యేలు వున్నారని చెబుతున్నారు. దీంతో పాటు పది మంది స్వతంత్రులు కూడా మద్దతు ఇస్తున్నారని అంటున్నారు. 

షిండే వర్గం, స్వతంత్రులు , బీజేపీకి మద్ధతిస్తే వారి బలం 154కి పెరుగుతుంది. అంటే సునాయాసంగా మెజార్టీ మార్క్ అయిన 144ను దాటేస్తుంది. ఇలా కాకుండా మరో వ్యూహాన్ని కూడా షిండే వర్గం అనుసరించే అవకాశం వుంది. శివసేన అసమ్మతి నేతలు 39 మంది సభకు హాజరుకాకపోతే... అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 248కి తగ్గనుంది. అంటే ఉద్ధవ్ థాక్రే తన బలాన్ని నిరూపించుకోవాలంటే 125 మంది సభ్యుల మద్ధతు అవసరం. ప్రస్తుతం మహా వికాస్ అఘాడి సభ్యుల బలం 110 మాత్రమే. ఈ పరీక్షల్లో బలపరీక్ష జరిగితే థాక్రే సర్కార్ కుప్పకూలే ప్రమాదం వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios