Maharashtra:మహారాష్ట్రలోని బుల్దానాలో ఓ షాకింగ్ ఘ‌టన జ‌రిగింది. ఆల‌స్యంగా వ‌చ్చిన ఓ వ‌రుడికి దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. పెళ్లి ముహూర్తాన్ని మ‌రిచి.. మ‌ద్యం మ‌త్తులో స్నేహితుల‌తో చిందులేస్తూ.. ఆల‌స్యం పెళ్లి మండ‌పానికి చేరుకున్నారు. అప్ప‌టికే  పెళ్ళి ముహూర్తం దాటిపోయింది. కోపోద్రిక్తుడైన  వ‌ధువు తండ్రి ఊరేగింపును వెనక్కి పంపి.. అదే మంటపంలోని మరో యువకుడితో కూతురికి పెళ్లి జరిపించాడు. 

Maharashtra: పెళ్లి మంటపం అలంకరించారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లికూతురు పెళ్లికి సిద్ధమై.. భవిష్యత్తు జీవితం గురించి కలలు కంటూ.. పెళ్లి పీఠ‌లెక్కింది. మెడలో తాళి కట్టే వరుడి కోసం వేయికళ్లతో ఎదురు చూస్తోంది. ముహూర్తం దాటి పోతుంది. అయినా.. పెళ్లి కొడుకు రాలేదు. తాళి కట్టలేదు. దీంతో అప్పటి వరకూ కళకళలాడిని కళ్యాణ మండపం మూగబోయింది. చిన్నబోయింది. దీనికి కార‌ణం.. పెళ్లి కొడుకు తాగిన మ‌త్తులో ముహూర్తం మ‌రిచి.. బ‌రాత్ లో చిందులేస్తున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన పెళ్లి కూతురు తండ్రి.. అదే మంటపంలోని మరో యువకుడితో త‌న కూతురికి పెళ్లి జరిపించాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని బుల్దానాలో జరిగింది.

వివరాల్లోకెళ్తే.. బుల్దానా జిల్లాలోని మల్కాపూర్ పాంగ్రా గ్రామంలో ఏప్రిల్ 24న ఓ పెళ్లిలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సాయంత్రం 4 గంటలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు పెద్ద‌లు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వధువు, వ‌రుడు తరపు బంధు మిత్రులు అందరూ మండ‌పానికి వ‌చ్చేస్తున్నారు. ముహూర్తం దాటిపోయింది. అయినా.. వరుడు ఇక వస్తాడులే అనుకుంటూ రాత్రి 8 గంటల వరకు చూశారు. కానీ, వరుడు మద్యం సేవించి.. స్నేహితులతో చిందులేస్తూ.. నిమ్మలంగా రాత్రి 8 గంట‌ల త‌రువాత క‌ళ్యాణ మంటపానికి చేరుకున్నాడు. అతడ్ని చూసిన వధువు తండ్రి కోపోద్రిక్తుడై.. తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించాడు. పెళ్లి కొడుకు దిమ్మ‌తిరిగి పోయేలా షాక్ ఇచ్చాడు. పెళ్లికి వచ్చిన ఓ స‌మీప‌ బంధువుకు త‌న కూతురుని ఇచ్చి.. కల్యాణం జరిపించాడు. దీంతో వరుడికి మద్యం మత్తు దిగిపోయింది. 

 వరుడు మద్యం మత్తులో ఉన్నాడని, అందుకే పెళ్లికి నిరాకరించాడని యువతి తండ్రి ఆరోపిస్తున్నారు. ముహూర్తం తర్వాత సాయంత్రం 4 గంటలకు ఊరేగింపు ఆమె ఇంటికి చేరుకుందని, వరుడు 8 గంటల వరకు నృత్యం చేస్తూనే ఉన్నారని బాలిక తండ్రి తెలిపారు. ఈ పెళ్లితో వధువు కూడా చాలా సంతోషంగా ఉంది.