OBC Reservation Issue: వెనుకబడిన తరగతుల (ఓబీసీ)ల‌కు రిజర్వేషన్లు కల్పించాలనే విష‌యంలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై మ‌హారాష్ట్ర భాజపా చీఫ్‌ చంద్రకాంత్ పాటిల్ అసంబ‌ద్ద వ్యాఖ్య‌లు చేశారు.  'రాజ‌కీయాలు అర్థం కాకుంటే ఇంటికెళ్లి వంట‌ చేసుకోవాల‌ని' సుప్రియను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

OBC Reservation Issue: మ‌హారాష్ట్రలో ఇత‌ర‌ వెనుకబడిన తరగతుల (ఓబీసీ)లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ విషయంలో భారతీయ జనతా పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య మాట‌ల‌ యుద్ధం జ‌రిగింది. ఈ త‌రుణంలో ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలేపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ నోరు పారేసుకున్నాడు. వివాదస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

రాజకీయాలు అర్థం కాకుంటే..ఇంటికి వెళ్లి వంట చేసుకోవాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేను మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు వివాదానికి దారితీశాయి. ఈ ప్రకటన తర్వాత.. మ‌హా రాజకీయాలు వేడెక్కాయి. బుధవారం ముంబైలో జరిగిన రాష్ట్ర బీజేపీ యూనిట్ ఎన్నికల్లో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసన కార్యక్రమంలో పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వివాదమేమిటీ..

మహారాష్ట్రలోని ఓబీసీలకు విద్యా, ఉద్యోగాల్లో కోటా అమలు చేయాలంటూ ఆ రాష్ట్ర భాజపా నాయకులు నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎంపీ సుప్రియ ఈ విషయంపై స్పందించారు. "మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రితం దిల్లీకి వెళ్లి ఎవరినో కలిసి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ, అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు. రెండు రోజుల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు కసరత్తు ప్రారంభమైంది" అని అన్నారు.

అదే సమయంలో ఈ ప్రకటనను తిప్పికొడుతూ.. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మీరు ఎందుకు రాజకీయాల్లో ఉన్నారు? రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికి వెళ్లి వంట చేసుకో... మీరు రాజకీయాల్లో ఉన్నారు, ముఖ్యమంత్రిని ఎలా కలవాలో తెలియదా? అని అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.

 ఇక సుప్రియపై చేసిన వ్యాఖ్యలు మహిళా లోకానికే అవమానమని ఆమె భర్త సదానంద సూలే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భార్యగా, తల్లిగా, విజయవంతమైన రాజకీయవేత్తగా సుప్రియ నెంబర్‌వన్‌గా ఉన్నారని అన్నారు. దేశంలోని అత్యంత తెలివైన నాయకుల్లో సుప్రియ ఒకరని, ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఆయన మండిపడ్డారు.

పాటిల్ వ్యాఖ్యలపై, NCP రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు విద్యా చవాన్ స్పందించింది. సిట్టింగ్ మహిళా ఎమ్మెల్యేకు టిక్కెట్ నిరాకరించిన వ్యక్తి మరియు ఆమె నియోజకవర్గం నుండి పోటీ చేశాడని అన్నారు. రెండుసార్లు సంసద్ రత్న అవార్డు పొందిన ఓ మహిళా ఎంపీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.