మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ నానా పటోలే గురువారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు అందజేశారు.

కాంగ్రెస్‌కు చెందిన పటోలే రెండు రోజుల క్రితమే ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. త్వరలో ఆయన రాష్ట్ర పీసీసీకి సారథ్యం వహించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పీసీసీ చీఫ్‌గా నియమితులు కానున్నందున ఆయన స్పీకర్‌ పదవి నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మిత్రపక్షాలకు కాంగ్రెస్‌ సమాచారం ఇచ్చింది.   

గతంలో కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన పటేలే 2014లో భండారా-గోండియా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017 బీజేపీకి పార్టీకి గుడ్‌ బై చెప్పి 2018లో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.

2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ సారథ్యంలో ఏర్పాటైన మహావికాస్‌ అఘాడీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.