Asianet News TeluguAsianet News Telugu

ముంబై హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకి: పిటిషన్ దాఖలు చేసిన మహారాష్ట్ర మాజీ మంత్రి

మహారాష్ట్ర ప్రభుత్వం, మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్  సీబీఐ విచారణను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.

Maharashtra Anil Deshmukh Ask Top Court To Cancel CBI Probe Against Him lns
Author
Mumbai, First Published Apr 6, 2021, 4:31 PM IST

ముంబై:మహారాష్ట్ర ప్రభుత్వం, మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్  సీబీఐ విచారణను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్ధాలు ఉన్న వాహనం నిలిపిన కేసులో  అరెస్టైన  సచిన్ వాజేకు రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రతి నెలా రూ. 100 కోట్లు వసూళ్లను లక్ష్యంగా పెట్టారని ముంబై మాజీ పోలీస్ కమిషనర్  పరంబీర్ సింగ్ ఆరోపణలు చేశారు.

ఈ విషయమై  ప్రాథమిక దర్యాప్తు చేయాలని ముంబై హైకోర్టు సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది.  ఈ తీర్పు వెలువడిన తర్వాత  మంత్రి పదవికి  అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది.

ముంబైలోని బార్లు, ఇతర లిక్కర్ షాపుల ద్వారా ప్రతి నెల రూ. 100 కోట్లు వసూలు చేయాలని మాజీ మంత్రి ఆదేశించారని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ ఆరోపించారు. కమిషనర్ పదవి నుండి తప్పించిన  తర్వాత ఆయన ఈ ఆరోపణలు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios